
లండన్: అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌తో కూడిన క్వాడ్ కూటమిని బలోపేతం చేయవద్దంటూ చైనా అగ్రనేత ఒకరు తనను హెచ్చరించేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఇండో–పసిఫిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాడన్నారు. సదరు నేత పేరును మాత్రం బయటపెట్టలేదు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఇది జరిగిందని తెలిపారు. క్వాడ్ పేరుతో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌ను ఒకే ఛత్రఛాయలోకి తీసుకురావద్దని చైనా నాయకుడు కోరాడని గుర్తుచేసుకున్నారు. 4 దేశాలు కూటమి కట్టకుండా, కలిసి పని చేయకుండా ఉండాలన్నదే ఆ నాయకుడి ఉద్దేశమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment