Xi Jinping: తైవాన్‌ విలీనం తప్పనిసరి! | Xi Jinping says reunification must be fulfilled | Sakshi
Sakshi News home page

Xi Jinping: తైవాన్‌ విలీనం తప్పనిసరి!

Published Sun, Oct 10 2021 5:55 AM | Last Updated on Sun, Oct 10 2021 9:42 AM

Xi Jinping says reunification must be fulfilled - Sakshi

బీజింగ్‌: తైవాన్‌ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్‌ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్‌ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇటీవల కాలంలో తైవాన్‌ గగనతలంలోకి పలుమార్లు చైనా విమానాల చొరబాట్లు జరిగాయి.

ఎప్పుడైనా చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్‌ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్‌ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్‌పింగ్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్‌ విలీనానికి తైవాన్‌ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకన్నారు. తమతో కలవడంతో కలిగే ప్రయోజనాలను తైవాన్‌ భవిష్యత్‌లో గ్రహిస్తుందన్నారు. తైవాన్‌ విలీనం చైనీయులందరి కోరికగా అభివరి్ణంచారు.  చదవండి: చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం

వివాదం ఎందుకు?
1911 తిరుగుబాటు అనంతరం చైనా పాలన కిందకు తైవాన్‌ వచ్చింది. 1949 నుంచి తైవాన్‌ స్వతంత్య్రం కోసం పోరాడుతోంది. అయితే బలప్రయోగం ద్వారానైనా తైవాన్‌ను కలుపుకోవాలన్నది చైనా యోచనగా నిపుణులు భావిస్తున్నారు. తైవాన్‌ అగ్రిమెంట్‌ను చైనా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధిపతి బైడెన్‌ చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్యలుండవని ఆశిస్తున్నామన్నారు. చైనా మాత్రం తైవాన్‌ అంశంలో బయటివారి ప్రమేయం అక్కర్లేదని ఘాటుగా బదులిచి్చంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని చెప్పింది.

హాంకాంగ్‌లాగానే వన్‌ కంట్రీ, టూ సిస్టమ్స్‌ విధానాన్ని తైవాన్‌తో కుదుర్చుకుంటామని చైనా చెబుతోంది. కానీ హాంకాంగ్‌ విషయంలో చివరకు చైనా పెత్తనమే అంతిమమైంది. పైగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని చైనా పేర్కొంటోంది. తైవాన్‌ అధ్యక్షుడు సైఇంగ్‌ వెన్‌ మాత్రం తమకు స్వాతంత్య్రమే అక్కర్లేదన్నారు. జింగ్‌పింగ్‌ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. అయితే సవరణలతో జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.  చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement