Reunification
-
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్‌సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి!
బీజింగ్: తైవాన్ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇటీవల కాలంలో తైవాన్ గగనతలంలోకి పలుమార్లు చైనా విమానాల చొరబాట్లు జరిగాయి. ఎప్పుడైనా చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్ విలీనానికి తైవాన్ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకన్నారు. తమతో కలవడంతో కలిగే ప్రయోజనాలను తైవాన్ భవిష్యత్‌లో గ్రహిస్తుందన్నారు. తైవాన్ విలీనం చైనీయులందరి కోరికగా అభివరి్ణంచారు. చదవండి: చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం వివాదం ఎందుకు? 1911 తిరుగుబాటు అనంతరం చైనా పాలన కిందకు తైవాన్ వచ్చింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్య్రం కోసం పోరాడుతోంది. అయితే బలప్రయోగం ద్వారానైనా తైవాన్ను కలుపుకోవాలన్నది చైనా యోచనగా నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ అగ్రిమెంట్‌ను చైనా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధిపతి బైడెన్ చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్యలుండవని ఆశిస్తున్నామన్నారు. చైనా మాత్రం తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అక్కర్లేదని ఘాటుగా బదులిచి్చంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని చెప్పింది. హాంకాంగ్లాగానే వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ విధానాన్ని తైవాన్‌తో కుదుర్చుకుంటామని చైనా చెబుతోంది. కానీ హాంకాంగ్ విషయంలో చివరకు చైనా పెత్తనమే అంతిమమైంది. పైగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని చైనా పేర్కొంటోంది. తైవాన్ అధ్యక్షుడు సైఇంగ్ వెన్ మాత్రం తమకు స్వాతంత్య్రమే అక్కర్లేదన్నారు. జింగ్పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. అయితే సవరణలతో జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా -
పునరేకీకరణపై మనకెందుకు తొందర?
పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ పునాదుల్ని పటిష్ట పరుచుకోవడానికి బదులు విలీనం, పునరేకీకరణపై వెంపర్లాడాల్సిన అవసరమేముందని సీపీఐ ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో గురువారం రాజకీయ తీర్మానం, సంస్థాగతకార్యకలాపాల నివేదిక, పార్టీ ముసాయిదా కార్యక్రమంపై చర్చ జరిగింది. ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు డి.రాజా ప్రతిపాదించిన ఈ నివేదికలపై 16 మంది సభ్యులు మాట్లాడారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ, విలీనం ప్రతిపాదనపై సీపీఐ అగ్ర నాయకత్వం చూపుతున్న అతి చొరవను ఆక్షేపిస్తూనే సీపీఎం నాయకత్వ ధోరణిపై కేరళ, గుజరాత్, పంజాబ్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కేరళ మహిళా ప్రతినిధులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని దునుమాడారు. ప్రస్తుత నాయకత్వానికి పదవుల్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రధాన కార్యదర్శి సురవరం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దానిపై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని వ్యక్తి దేశానికి ఏమి బోధిస్తారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో పార్టీ అతలాకుతమైతే ఒక్కసారన్నా పర్యటించారా? అని నిలదీశారు. భూసేకరణ బిల్లుకు నిరసనగా మే 14న ఉద్యమానికి పార్టీ మహాసభ పిలుపిచ్చింది.