సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
‘‘ అమెరికా, జపాన్‌ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్‌సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు.
రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం
కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్‌ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్‌ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం.
ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్‌లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment