
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.
ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్.. రీ, కాంగ్ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది.
చదవండి : మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment