కొరియా దేశాల మధ్య హైఅలర్ట్‌.. కిమ్‌ ఆర్మీలోకి భారీ చేరికలు | 1.4 Millions Of Young People Applied To Join In North Korea Army This Week, More Details | Sakshi
Sakshi News home page

కొరియా దేశాల మధ్య హైఅలర్ట్‌.. కిమ్‌ ఆర్మీలోకి భారీ చేరికలు

Published Wed, Oct 16 2024 8:11 AM | Last Updated on Wed, Oct 16 2024 10:14 AM

Millions Of young people Joined In North Korea Army

సియోల్‌: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్‌ లీగ్‌ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్‌ కొరియా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్‌ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్‌గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.

అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు.  

ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌లో జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement