Korean Central News Agency
-
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్‌సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
North Korea: మరింత ‘అణు’ దూకుడు
సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది. -
నియంతతో ఆటలా.. ఎంత ధైర్యం!
ప్యోంగ్ యాంగ్: ఇప్పటికీ నియంతృత్వం అమలవుతున్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పిలిచే ఈ దేశంలో చాలా కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. ఇప్పటివరకు 340 మందికి మరణశిక్ష విధించిన క్రూరుడుగా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు పేరుంది. తండ్రి కిమ్ జాంగ్-2 మరణానంతరం 2011లో పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2016 చివరి వరకు కిమ్ ఈ శిక్షలు విధించడం గమనార్హం. అలాంటి నియంతతో ఓ వ్యక్తి చనువుగా ఉండటమే అసాధ్యమైన పని.. అలాంటిది కిమ్‌తో ఓ వ్యక్తి సరదాగా ఎంతో చనువుగా ఆట (ఇక్కడ మనం ఆడే ఉప్పు బస్త ఆట) ఆడటం తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు అడ్డొస్తాడని భావించి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే. అలాంటిది ఓ అధికారితో కిమ్ ఎందుకంత సన్నిహితంగా ఉన్నాడా అనే ప్రశ్న అందరినీ ఆలోచింప జేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు రావడంతో విషయం బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. క్షిపణి పరీక్షలతో తరచుగా వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా ఇటీవల కూడా ఓ రాకెట్ మిస్సైల్, ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. అది విజయవంతమైనట్లుగా కొరియా న్యూస్ ఏజెన్సీ ప్రకటించుకుంది. ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన అధికారులను నియంత కిమ్ అభినందించారు. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి ఏకంగా కిమ్ వీపుపై ఎక్కేసి సరదాగా ఈ ఆనందాన్ని ఆస్వాదించాడు. బంధువులను, అధికారులను వారికి సంబంధించిన వారి ముందే క్రూరంగా చంపించే కిమ్.. ఆ అధికారిని ఒక్కమాట అనగపోగా.. తాను కూడా చిన్న పిల్లాడిగా చిరునవ్వులు చిందించారు. అధికారి పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ ఆఫీసర్ నేతృత్వంలోనే రాకెట్ ను ప్రయోగించడంతో పాటు, మరిన్ని ఖండాంతర క్షిపణుల ప్రయోగాలలో ఆయన పాత్ర కీలకమని భావించిన కిమ్ ఆ ఆఫీసర్‌ను శిక్షించలేదని మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి.