రాజస్తాన్ గ్యాంగ్ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది.
ఐతే ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్‌లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గ్యాంగ్‌స్టర్ రాజుతేత్‌కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్‌పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్‌పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు.
(చదవండి: వీడియో: గ్యాంగ్‌వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్ రాజు దారుణ హత్య)
Comments
Please login to add a commentAdd a comment