open fire
-
అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు
మిచిగాన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని ఓ చిల్డ్రన్స్ వాటర్ పార్క్ వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. దీంతో అక్కడ ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మందికి గాయలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.US Shooting: Nine Including Children Injured After Gunman ‘Randomly’ Opens Fire at Splash Pad in Michigan’s Rochester Hills, SWAT Team Mobilised (Watch Videos)https://t.co/tzoa7U1wtM#US #Michigan #RochesterHills #Shooting— LatestLY (@latestly) June 16, 2024 శనివారం సాయంత్ర 5 గంటలకు చిల్డ్రన్స్ పార్క్‌కు వద్ద గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు మిషిగాన్పోలీసులు తెలిపారు. పలుసార్లు అతడు గన్‌లోడ్ చేసుకొని మరీ 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటివల అమెరికాలోని ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వరుస ఘటనలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
రాజస్తాన్ గ్యాంగ్‌స్టర్ హత్య.. వెలుగులోకి మరో దారుణం
రాజస్తాన్ గ్యాంగ్ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఐతే ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ రాజుతేత్‌కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్‌పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్‌పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు. (చదవండి: వీడియో: గ్యాంగ్‌వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్ రాజు దారుణ హత్య) -
వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైరింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీస్ వెపన్తో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి ఎలా ఫైరింగ్ చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి కాల్పులు జరిపిన ఆయుధం ఎస్ఎల్ఆర్ అని ముందు ప్రచా రం జరిగింది. ఆ తర్వాత ఇన్సాస్ వెపన్ అని పోలీస్ అధికారులు చెప్పారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘సాక్షి‘తో మాట్లాడుతూ తాను ఎవరి వద్దా గన్ తీసుకోలేదని, ఎస్పీనే స్వయంగా ఇస్తే కాల్చానని వివరణ ఇచ్చారు. గతంలో వరంగల్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఫైరింగ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాల్చానన్నారు. ఆ అధికారం నాకుంది: ఎస్పీ దీనిపై మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లును ఫోన్లో సంప్రదించగా బుల్లెట్లు లేని బ్లాంక్ అమ్యూనేషన్ను ఉత్సవాల సందర్భంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఉపయోగించింది ఎస్ఎల్ఆర్ వెపన్ కాదు.. దేశీతయారీ ఇన్సాస్ వెపన్. దీనికి అనుమతి ఇచ్చే అధికారం ఎస్పీగా నాకు ఉంది. ప్రభు త్వం ద్వారా నిర్వహించే ఉత్సవాలు, ర్యాలీ లు, క్రీడల ప్రారంభ సమయంలో బ్లాంక్ అమ్యునేషన్ను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. బ్లాంక్ అమ్యునేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీటిని వినియోగించడం చట్టబద్ధమే’ అని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని చెప్పారు. ఈ నెల 11న వరంగల్‌లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఇన్సాస్ బ్లాంక్ అమ్యునేషన్ మాత్రమే వినియోగించినట్లు ఒక ప్రకటనలో వివరించారు. తుపాకీని మంత్రి వినియోగించారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారులపై చర్యలు ఉంటాయని పోలీస్‌శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం: అదనపు డీజీపీ జితేందర్ మంత్రి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై పోలీస్ శాఖ విచారణ జరుపుతోందని శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. అది గిట్టని వారి ప్రచారం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘ఫ్రీడం ర్యాలీ’ ఘటనపై మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలోనూ తనపై ఈ తరహా దుష్ప్రచారాలు అనేకం జరిగాయని, రాజకీయంగా గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ‘ర్యాలీలు జరిగినప్పుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ (ఖాళీ తుపాకీ)తో గాల్లోకి కాల్చడం సర్వసాధారణం. బుల్లెట్లు లేని గన్ పేల్చినప్పుడు శబ్దం మాత్రం వస్తుంది. అందులో కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని కూడా. తుపాకులు, బుల్లెట్ల గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది’ అని శ్రీనివాస్‌గౌడ్ వివరణ ఇచ్చారు. ‘క్రీడా శాఖ మంత్రిగా నాకు కొన్ని అధికారాలున్నాయి. వరంగల్‌లో లేని వివాదం మహబూబ్‌నగర్‌లో ఎందుకు వచ్చిందో గమనించాలి. రాజకీయాల్లో నేను ఎదగడాన్ని కొందరు ఓర్చుకోలేక పోతున్నారు. వజ్రోత్సవాలను హైలైట్ చేయకుండా చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరిస్తున్నారు. బురద జల్లే పద్ధతి సరికాదు’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాగా, రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయినా, స్పోర్ట్స్ మంత్రి అయినా.. ఇన్సాస్ రైఫిల్‌ను జనాల్లో ఫైర్ చేయడం తప్పని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బర్తరఫ్ చేయాలి: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో బహిరంగంగా గాలిలో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాలిలో కాల్పులు జరపడం చూస్తే తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. తాను క్రీడా మంత్రిననీ, కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గు చేటని, మంత్రి వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతున్నవి కూడా రబ్బర్ బుల్లెట్లేనా అని ఆమె ఎద్దేవా చేశారు. ఎస్పీనే తుపాకీతో గాలిలో కాల్పులు జరపమన్నారని మంత్రి చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుMý ుని ఆ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. -
బంగ్లాదేశ్ హైకమిషన్ బయట కాల్పులు... తనను తాను కాల్చుకోబోయి...
కోల్‌కతా: డిప్రెషన్‌కి గురైన ఓ పోలీస్ ఆత్మహత్య చేసుకుందామని తుపాకీని తనవైపుకి తిప్పుకునేలోపే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఈ మేరకు కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల సాయుధ బలగాలకు చెందిన ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఐతే తుడుప్ లెప్చా అనే కానిస్టేబుల్ ఒక గంట పాటు ఆ ప్రాంతంలో సంచరిస్తూ, అకస్మాత్తుగా కాల్పులు జరిపాడని, ఆ తర్వాత తుపాకీని తనవైపుకి తిప్పుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్ నుంచే ఈ కాల్పులు జరిగాయని వెల్లడించారు. పైగా లెప్చా కోల్‌కతా సాయుధ పోలీసుల 5వ బెటాలియన్‌కు చెందినవాడని, బంగ్లాదేశ్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నడాని చెప్పారు మొన్నటిదాక సెలవుల్లో ఉన్న ఆయన ఈ ఉదయమే విధుల్లోకి చేరాడని, పైగా డిప్రెషన్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్, మరో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్) -
రియల్ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు
-
కశ్మీర్లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి
Terrorists Open Fire On Police Bus: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం సాయంత్రం పంథా చౌక్‌లోని జెవాన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సాయుధ పోలీసు బలగాలను తీసుకెళ్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. దీంతో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు చనిపోగా మరో 12 మంది పోలీసులు గాయపడ్డారు. చదవండి: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్ క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనతో అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, తనిఖీలు చేపట్టాయి. శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు విదేశీయుడని పోలీసులు తెలిపారు. సరిహద్దుల గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. -
బీజేపీ నాయకుడి ఇంటిపై ఉగ్రదాడి
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. బీజేపీ నాయకుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ నౌగామ్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర శివార్లలోని నౌగామ్, అరిగం ప్రాంతంలోని బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటి బయట గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సెంట్రీని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు హస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నజీర్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా, పార్టీ కశ్మీర్ యూనిట్ ఈ దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మంజూర్ భట్ తెలిపారు. #NewsAlert | One cop martyred as terrorists target guard post outside BJP leader's residence in Naugam, J&K. Details by Ieshan & Sohil. pic.twitter.com/rjjqDAgaw7 — TIMES NOW (@TimesNow) April 1, 2021 చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు -
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
-
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది. శ్రీనగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్ బర్జుల్లాలోని ఓ టీ స్టాల్ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడు. ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసి ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌లు మరణించారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. శ్రీనగర్‌లో మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు ఇలా బరి తెగించడం ఇది రెండో సారి. నగరంలోని హై సెక్యూరిటీ దుర్గానాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కొడుకుపై మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చదవండి: అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
వాషింగ్టన్లో కాల్పులు: ఒకరు మృతి
అమెరికా: వాషింగ్టన్లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. పట్టపగలే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ముగ్గురు ఆఫ్రికన్ అమెరికన్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వాషింగ్టన్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని 14 వీధి, స్పింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసు చీఫ్ పీటర్ న్యూషామ్ తెలిపారు. ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు పెద్ద గన్స్‌ను, మరో వ్యక్తి పిస్టల్‌తో జనాలపై విచక్షణరహితంగా ఆదివారం కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. (24 గంటల్లో 2.6 లక్షల మందికి) ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. పట్టపగలు ఇలా దారుణంగా కాల్పులకు తెగపడటం సమాజంలో భయం కల్పించే దుర్ఘటన అన్నారు. దుండగుల కాల్పులు సంఘంలోని ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. -
హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు పవిత్రా రాయ్‌ను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మాల్దాలో పవిత్రా రాయ్ ప్రయాణిస్తున్న కారు.. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ టీనేజర్ (18) అక్కడిక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా పవిత్రా రాయ్ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు చుట్టుముట్టి కారును ఆపారు. పవిత్రా రాయ్ కారు దిగకుండా వీరంగం సృష్టించాడు. కారు లోపల నుంచే జనంపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కారులో పవిత్రా రాయ్‌తో పాటు ఐదుగురు ఉన్నారు. ఆదివారం రాత్రి పోలీసులు టీఎంసీ నేతను అరెస్ట్ చేశారు. ఆయనతో కలసి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాగా పవిత్రా రాయ్ కాల్పులు జరిపిన ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. -
ఆర్మీ క్యాంప్‌పై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్ తిరప్ జిల్లాలో అసోం రైఫిల్స్‌కి చెందిన ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరు గాయపడ లేదని జిల్లా ఎస్పీ అజిత్ కుమార్ సంగ్లా ఆదివారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలిపారు. ఈ దాడికి పాల్పడింది ఎన్ఎస్సీఎన్ (కే) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. మణిపూర్‌లో ఆర్మీ క్యాంప్‌పై దాడి ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. -
విద్యార్థులు వెళ్తున్న స్కూల్ బస్సుపై కాల్పులు
గురుదాస్‌పూర్: పంజాబ్‌లో విద్యార్థులు, స్టాఫ్ ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ సరిహద్దు గ్రామం మాంగియా వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. అయితే విద్యార్థులు, ఇతర సిబ్బంది తృటిలో్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్కూల్ సయమం ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకెళ్తున్న సమయంలో.. నలుగురు దుండగులు కారులో వచ్చి బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరాయ్యారు. ఈ సంఘటనలో ఎవరికి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పాక్ కాల్పుల్లో భారతీయ జవాను మృతి
జమ్మూ: పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెరలేపడంతో ఒక భారతీయ జవాను మృతిచెందాడు. ఆక్నూర్ సెక్టార్ లోని పల్లన్ వాలా ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు చిన్న సైజు ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు మిలటరీ ప్రతినిధి మనీష్ మెహ్తా తెలిపారు. ఆ దాడిని భారతీయ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. అయితే ఒక జవాను మాత్రం ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడన్నారు. గతేడాది నుంచి పాక్ సైన్యం పలుమార్పు కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తోంది. గతేడాది నుంచి చూస్తే ఇప్పటి వరకూ పాకిస్తాన్ దాదాపు 150 సార్లు కాల్పుల విరమణ ఉల్లఘించింది. -
మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ ఆర్ ఎస్ పురా సెక్ట్రర్లోని సరిహద్దు భద్రత దళం లక్ష్యంగా ఔట్ పోస్ట్‌లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో సరిహద్దు భద్రత దళం వెంటనే అప్రమత్తమై... పాక్ సైన్యంపై ఎదురుకాల్పులకు దిగింది. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే.