ఇటానగర్ : అరుణాచల్ప్రదేశ్ తిరప్ జిల్లాలో అసోం రైఫిల్స్కి చెందిన ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరు గాయపడ లేదని జిల్లా ఎస్పీ అజిత్ కుమార్ సంగ్లా ఆదివారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలిపారు.
ఈ దాడికి పాల్పడింది ఎన్ఎస్సీఎన్ (కే) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. మణిపూర్లో ఆర్మీ క్యాంప్పై దాడి ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.