సాక్షి,హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో బహిరంగంగా గాలిలో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాలిలో కాల్పులు జరపడం చూస్తే తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు.
తాను క్రీడా మంత్రిననీ, కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గు చేటని, మంత్రి వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతున్నవి కూడా రబ్బర్ బుల్లెట్లేనా అని ఆమె ఎద్దేవా చేశారు. ఎస్పీనే తుపాకీతో గాలిలో కాల్పులు జరపమన్నారని మంత్రి చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుMý ుని ఆ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment