జమ్మూ: పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెరలేపడంతో ఒక భారతీయ జవాను మృతిచెందాడు. ఆక్నూర్ సెక్టార్ లోని పల్లన్ వాలా ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు చిన్న సైజు ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు మిలటరీ ప్రతినిధి మనీష్ మెహ్తా తెలిపారు. ఆ దాడిని భారతీయ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. అయితే ఒక జవాను మాత్రం ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడన్నారు.
గతేడాది నుంచి పాక్ సైన్యం పలుమార్పు కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తోంది. గతేడాది నుంచి చూస్తే ఇప్పటి వరకూ పాకిస్తాన్ దాదాపు 150 సార్లు కాల్పుల విరమణ ఉల్లఘించింది.
పాక్ కాల్పుల్లో భారతీయ జవాను మృతి
Published Tue, Jul 22 2014 4:21 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM
Advertisement
Advertisement