RS Pura sector
-
పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో భారత జవాన్లపై పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జమ్మూ/సాక్షి, చెన్నై: భారత్‌తో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌కానిస్టేబుల్ ఎ.సురేశ్ చనిపోయారు. ఇంకా సరిహద్దులో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
అనాథలతో దీపావళి జరుపుకున్న సీఎం
సాక్షి, ఆర్ఎస్ పుర (కశ్మీర్) : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం అనాథ పిల్లలతో కలిసి కశ్మీర్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా సెక్టార్లో ఉన్న ఆనాథాశ్రయంలోని పిల్లలతో మెహబూబా ముప్తీ పండగ పూట సరదాగా గడిపారు. చిన్నారుకు మిఠాయి పంచడమేకాక వారికి తానే స్వయంగా తినిపించారు. చిన్నారుల భజన పాటలకు సీఎం పరవశించిపోయారు. గత ఏడాది కూడా సీఎం మెహబూబా ముఫ్తి అనాథ చిన్నారులతోనే దీపావళి వేడుకులను జరుపుకోవడం గమనార్హం. -
ఆగని పాక్ కాల్పులు
జమ్మూ: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు, ఆర్మీ స్థావరాలపై పాక్ రేంజర్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీగా కాల్పులు, మోర్టారు బాంబు దాడులకు పాల్పడ్డారు. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. శుక్రవారం భారత జవాన్ల ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోటానా ఖుర్ద్, అబ్దులియాన్‌లలో పొరుగు దేశ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డీకే ఉపాధ్యాయ చెప్పారు. ఈ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు భారత జ వాన్ ఒకరు కాపలా టవర్ నుంచి కిందికి దూకాడని, అతని కాలికి గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల వల్ల హిరానగర్ సెక్టార్‌లోని వెయ్యిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. బాబియా గ్రామం నుంచి 400 మందిని ఆర్మీకి చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
భారత గగనతలంలోకి పాక్ విమానం?
జమ్మూ: పాకిస్థాన్ విమానమొకటి సోమవారం భారత గగనతలంలోకి వచ్చి, కొన్ని నిమిషాల్లోనే తిరిగి వెళ్లిందని తెలుస్తోంది. జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక విమానం కనిపించిందని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) చెప్పింది. ఆరు రెక్కలతో సిల్వర్ రంగులో ఉన్న ఎగిరే వస్తువు మధ్యాహ్నం 1.10 గంటలకు భారత గగనతలంలోకి వచ్చి వెంటనే వెనక్కి వెళ్లినట్లు జవాను ఒక నివేదికను ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇందులో నిజమెంతో తెలుసుకోవాలని వాయుసేనను బీఎస్ఎఫ్ కోరింది. అనుమానాస్పద విమానం వచ్చిన ట్లు తమ రాడార్స్ గుర్తించలేదని వాయుసేన తెలిపింది. -
సినిమాలో చూపినట్టు ఆ సొరంగం నిజమే!
జమ్ముకశ్మీర్: అనుకోకుండా తప్పిపోయి భారత్‌కు వచ్చిన చిన్నారి 'మున్నీ'ని తిరిగి పాకిస్థాన్ చేర్చేందుకు అష్టకష్టాలు పడతాడు బజరంగీ భాయ్‌జాన్. భద్రతా దళాల కళ్లుగప్పి సరిహద్దుల మీదుగా భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు భారీ భూసొరంగం మార్గం ఒకటి దొరకడంతో దాని నుంచి ఎలాగోలా పాక్ చేరుకుంటాడు. ఇది సల్మాన్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ సినిమా 'బజరంగీ భాయ్‌జాన్'లోని ఓ సన్నివేశం. భారత్-పాక్ మధ్య భూసొరంగం ఉన్నట్టు ఆ సినిమాలో చూపింది కల్పితమే కావొచ్చుకానీ, అలాంటి సొరంగం మార్గం నిజంగానే ఇరుదేశాల సరిహద్దుల కింద ఉందని తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గుర్తించింది. పాక్ నుంచి జమ్ముకశ్మీర్ లోకి చొరబడేందుకు వీలుగా ఉన్న ఓ సొరంగాన్ని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద గురువారం కనుగొన్నారు. జమ్ము జిల్లాలోని ఆర్ఎస్ పుర సెక్టర్లో అల్లా మేయి కోథాయ్ ప్రాంతంలో ఈ భారీ భూసొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఇది 50 అడుగుల పొడవుతో ఉన్నట్టు గుర్తించారు. బీఎస్ఎఫ్ అధికారులు ఈ భూసొరంగం ఉన్న ప్రదేశానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాట్లు జరిపేందుకు ఈ భూసొరంగాన్ని ఉపయోగించుకుంటున్నారా? అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. -
పాక్ కాల్పుల్లో భారతీయ జవాను మృతి
జమ్మూ: పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెరలేపడంతో ఒక భారతీయ జవాను మృతిచెందాడు. ఆక్నూర్ సెక్టార్ లోని పల్లన్ వాలా ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు చిన్న సైజు ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు మిలటరీ ప్రతినిధి మనీష్ మెహ్తా తెలిపారు. ఆ దాడిని భారతీయ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. అయితే ఒక జవాను మాత్రం ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడన్నారు. గతేడాది నుంచి పాక్ సైన్యం పలుమార్పు కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తోంది. గతేడాది నుంచి చూస్తే ఇప్పటి వరకూ పాకిస్తాన్ దాదాపు 150 సార్లు కాల్పుల విరమణ ఉల్లఘించింది. -
మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ ఆర్ ఎస్ పురా సెక్ట్రర్లోని సరిహద్దు భద్రత దళం లక్ష్యంగా ఔట్ పోస్ట్‌లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో సరిహద్దు భద్రత దళం వెంటనే అప్రమత్తమై... పాక్ సైన్యంపై ఎదురుకాల్పులకు దిగింది. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే.