
సాక్షి, ఆర్‌ఎస్ పుర (కశ్మీర్) : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం అనాథ పిల్లలతో కలిసి కశ్మీర్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో ఉన్న ఆనాథాశ్రయంలోని పిల్లలతో మెహబూబా ముప్తీ పండగ పూట సరదాగా గడిపారు. చిన్నారుకు మిఠాయి పంచడమేకాక వారికి తానే స్వయంగా తినిపించారు. చిన్నారుల భజన పాటలకు సీఎం పరవశించిపోయారు. గత ఏడాది కూడా సీఎం మెహబూబా ముఫ్తి అనాథ చిన్నారులతోనే దీపావళి వేడుకులను జరుపుకోవడం గమనార్హం.