మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్ | Pakistan violates ceasefire again, open fires at Pindi outpost in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్

Published Sat, Jul 12 2014 12:30 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

Pakistan violates ceasefire again, open fires at Pindi outpost in Jammu and Kashmir

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ ఆర్.ఎస్. పురా సెక్టార్లోని భారత జవాన్లు లక్ష్యంగా పిండి ఔట్ పోస్ట్పై పాక్ కాల్పులకు తెగబడింది. భారత జవాన్లు వెంటనే స్పందించి ఎదురుకాల్పులకు దిగిందని ఉన్నతాధికారి వెల్లడించారు. శనివారం ఉదయం ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

 

గత నెల 13న భారత్ జవాన్లు లక్ష్యంగా భారత సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement