open fires
-
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి
టెక్సాస్‌లో దుండగుల జరిపిన కాల్పుల కలకలంతో ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కొందరు దుండగలు శనివారం టెక్సాస్‌లోని ఓ మాల్లోసాముహిక కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మాటల్లో చెప్పలేని విషాదం.. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో కాల్పులు జరుపుతున్న అగంతకుడుని కాల్చి చంపేసినట్లు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో మరోక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు . ఈ ఘటనపై స్పందించిన టెక్సాస గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా అభివర్ణించారు. సదరు అగంతకుడి ఆచూకి కోసం టెక్సాస్ పోలీసులు మాల్లోని దుకాణాల వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి జైనల్ పర్వేజ్ మాట్లాడుతూ..తన కూతురు కాల్పుల జరుగుతున్నట్లు చెప్పడంతో తాను మాల్ వద్దకు వచ్చానని, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మమ్మల్నిలోపలకి వెళ్లమని సైగ చేశారని తెలిపాడు. ఆ తదనంతరం తాను తన కూతురుని రక్షించే యత్నంలో ఉండగా.. ఒక అంగతుడిని పోలీసులు చంపేశారని చెప్పాడు. ఇంతలో మరో అగంతకుడు కాల్పులు జరుపుతూ కనిపించినట్లు తెలిపాడు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..) -
జగిత్యాలలో కాల్పుల కలకలం
సాక్షి, జగిత్యాల : భార్యభర్తల గొడవ కాల్పులకు దారితీసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిదారం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు శ్రీనివాస్, ఇస్రాజుపల్లికి చెందిన గీతిక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గీతిక ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, గత అర్థరాత్రి ఇస్రాజుపల్లికి వెళ్లిన శ్రీనివాస్.. భార్యతో గొడవకు దిగాడు. మేనమామ రాజిరెడ్డి అడ్డుకోబోగా శ్రీనివాస్ అతనిపై తుపాకితో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రాజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క బులెట్ కడుపులో నుంచి మరో బులెట్ చేతులోనుంచి దూసుకెళ్లింది. రాజిరెడ్డి ప్రసుత్తం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ ఆర్.ఎస్. పురా సెక్టార్‌లోని భారత జవాన్లు లక్ష్యంగా పిండి ఔట్ పోస్ట్‌పై పాక్ కాల్పులకు తెగబడింది. భారత జవాన్లు వెంటనే స్పందించి ఎదురుకాల్పులకు దిగిందని ఉన్నతాధికారి వెల్లడించారు. శనివారం ఉదయం ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. గత నెల 13న భారత్ జవాన్లు లక్ష్యంగా భారత సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే.