
టెక్సాస్‌లో దుండగుల జరిపిన కాల్పుల కలకలంతో ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కొందరు దుండగలు శనివారం టెక్సాస్‌లోని ఓ మాల్‌లోసాముహిక కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
మాటల్లో చెప్పలేని విషాదం..
ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో కాల్పులు జరుపుతున్న అగంతకుడుని కాల్చి చంపేసినట్లు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో మరోక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు . ఈ ఘటనపై స్పందించిన టెక్సాస గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా అభివర్ణించారు.
సదరు అగంతకుడి ఆచూకి కోసం టెక్సాస్ పోలీసులు మాల్‌లోని దుకాణాల వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి జైనల్ పర్వేజ్ మాట్లాడుతూ..తన కూతురు కాల్పుల జరుగుతున్నట్లు చెప్పడంతో తాను మాల్ వద్దకు వచ్చానని, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మమ్మల్నిలోపలకి వెళ్లమని సైగ చేశారని తెలిపాడు. ఆ తదనంతరం తాను తన కూతురుని రక్షించే యత్నంలో ఉండగా.. ఒక అంగతుడిని పోలీసులు చంపేశారని చెప్పాడు. ఇంతలో మరో అగంతకుడు కాల్పులు జరుపుతూ కనిపించినట్లు తెలిపాడు.
(చదవండి: కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..)
Comments
Please login to add a commentAdd a comment