నవజాత శిశువులకు తల్లిపాలు వివిధ వ్యాధుల బారిన పడకుండా రక్షించే అమృత ధారలు. కొందరూ తల్లులకు వివిధ కారణా వల్ల ఆ అమృతధారలు ఉత్పత్తి కావు. దీంతో అలాంటి తల్లులు పిల్లలకు స్వచ్ఛమైన అమ్మపాలు ఎలా అందించాలో తెలియక చాలా సతమతమవుతుంటారు. అలాంటి తల్లుల వెతలను తీర్చేలా కొంతమంది తల్లులు తమ బ్రెస్ట్ మిల్క్‌ని స్వచ్ఛందంగా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా ఓ తల్లి రెండు లీటర్లకు పైగా తన రొమ్ము పాలను అందించి ఎందరో బిడ్డల ఆకలిని తీర్చి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఎవరామె..?. ఆమెకి ఇదెలా సాధ్యమయ్యింది..?
టెక్సాస్‌కి చెందిన అలిస్సా ఓగ్లేట్రీ ఈ రికార్డుని సృష్టించింది. గతంలో 2014లో 1,569.79 లీటర్ల పాల దానంతో తనపేరు మీదు ఉన్న రికార్డును ఓగ్లేట్రీనే బద్దలుగొట్టి తిరగరాసింది. ఈసారి ఏకంగా రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్‌ని దానం చేసి ఆమె హృదయం చాలా విశాలం అని చాటిచెప్పింది. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రకారం..ఒక లీటరు తల్లిపాలతో నెలలు నిండకుండా పుట్టిన దాదాపు 11 మంది చిన్నారులను పోషించొచ్చట. .
దీని ఆధారంగా ఆమె ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి పైగా శిశువుల ఆకలిని తీర్చిందని గిన్నిస్ రికార్డు అంచనా వేసింది. ఓగ్లెట్రీ 2010లో కొడుకు కైల్‌కి జన్మనిచ్చినప్పటి నుంచి తల్లి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే తాను అరుదైన హైపర్‌లాక్టేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. దీనికారణంగా ఆమె చనుబాల ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుంటుంది.
అలా రోజు రోజుకి రెండింతలుగా పాలు వస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆ క్రమంలోనే ఆమె మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ టైంలోనూ పాలధారలు ఆగలేదు. అలా నేటివరకు రోజుకి ఆరులీటర్ల చొప్పున తల్లిపాలు ఉత్పత్తవ్వుతున్నాయి. ఈ చనుబాల ఉత్పత్తి ఆగిపోవాలంటే మందులు వాడడం లేదా డబుల్ మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రెండింటిని వద్దని నెలనిండకుండా పుట్టిన పిల్లలకు అందించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది.
అలా ఆమె తన పిల్లలు పాలు తాగడం మానేసిన తర్వాత కూడా పంపింగ్ కొనసాగించి లీటర్లకొద్ది పాలను మిల్క్ బ్యాంక్‌కి ఇచ్చేది. అందుకోసం తాను ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి మరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. ఎందుకంటే తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆమె పాలు నవజాత శిశువుకు పోషణకు ఉపయోగపడతాయని అంటోంది ఓగ్లేట్రీ.
నేను ఇలా ఎంతమంది చిన్నారుకు సహాయం చేశానో.. అనేది తలచుకుంటే చాలా సంతృప్తినిస్తుందని చెబుతోంది. అంతేగాదు ఓగ్లేట్రీ తల్లిపాలను దానం చేయడంపై అవగాహన కల్పించాలనుకుంటోంది. తనలాగే ఇతర మహిళలు కూడా స్వచ్ఛందంగా పాలను దానం చేసేలా ముందుకురావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఓగ్లేట్రీ.
(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!)
Comments
Please login to add a commentAdd a comment