breast milk
-
రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!
నవజాత శిశువులకు తల్లిపాలు వివిధ వ్యాధుల బారిన పడకుండా రక్షించే అమృత ధారలు. కొందరూ తల్లులకు వివిధ కారణా వల్ల ఆ అమృతధారలు ఉత్పత్తి కావు. దీంతో అలాంటి తల్లులు పిల్లలకు స్వచ్ఛమైన అమ్మపాలు ఎలా అందించాలో తెలియక చాలా సతమతమవుతుంటారు. అలాంటి తల్లుల వెతలను తీర్చేలా కొంతమంది తల్లులు తమ బ్రెస్ట్ మిల్క్‌ని స్వచ్ఛందంగా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా ఓ తల్లి రెండు లీటర్లకు పైగా తన రొమ్ము పాలను అందించి ఎందరో బిడ్డల ఆకలిని తీర్చి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఎవరామె..?. ఆమెకి ఇదెలా సాధ్యమయ్యింది..?టెక్సాస్‌కి చెందిన అలిస్సా ఓగ్లేట్రీ ఈ రికార్డుని సృష్టించింది. గతంలో 2014లో 1,569.79 లీటర్ల పాల దానంతో తనపేరు మీదు ఉన్న రికార్డును ఓగ్లేట్రీనే బద్దలుగొట్టి తిరగరాసింది. ఈసారి ఏకంగా రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్‌ని దానం చేసి ఆమె హృదయం చాలా విశాలం అని చాటిచెప్పింది. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రకారం..ఒక లీటరు తల్లిపాలతో నెలలు నిండకుండా పుట్టిన దాదాపు 11 మంది చిన్నారులను పోషించొచ్చట. . దీని ఆధారంగా ఆమె ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి పైగా శిశువుల ఆకలిని తీర్చిందని గిన్నిస్ రికార్డు అంచనా వేసింది. ఓగ్లెట్రీ 2010లో కొడుకు కైల్కి జన్మనిచ్చినప్పటి నుంచి తల్లి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే తాను అరుదైన హైపర్‌లాక్టేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. దీనికారణంగా ఆమె చనుబాల ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుంటుంది. అలా రోజు రోజుకి రెండింతలుగా పాలు వస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆ క్రమంలోనే ఆమె మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ టైంలోనూ పాలధారలు ఆగలేదు. అలా నేటివరకు రోజుకి ఆరులీటర్ల చొప్పున తల్లిపాలు ఉత్పత్తవ్వుతున్నాయి. ఈ చనుబాల ఉత్పత్తి ఆగిపోవాలంటే మందులు వాడడం లేదా డబుల్ మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రెండింటిని వద్దని నెలనిండకుండా పుట్టిన పిల్లలకు అందించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలా ఆమె తన పిల్లలు పాలు తాగడం మానేసిన తర్వాత కూడా పంపింగ్ కొనసాగించి లీటర్లకొద్ది పాలను మిల్క్ బ్యాంక్‌కి ఇచ్చేది. అందుకోసం తాను ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి మరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. ఎందుకంటే తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆమె పాలు నవజాత శిశువుకు పోషణకు ఉపయోగపడతాయని అంటోంది ఓగ్లేట్రీ. నేను ఇలా ఎంతమంది చిన్నారుకు సహాయం చేశానో.. అనేది తలచుకుంటే చాలా సంతృప్తినిస్తుందని చెబుతోంది. అంతేగాదు ఓగ్లేట్రీ తల్లిపాలను దానం చేయడంపై అవగాహన కల్పించాలనుకుంటోంది. తనలాగే ఇతర మహిళలు కూడా స్వచ్ఛందంగా పాలను దానం చేసేలా ముందుకురావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఓగ్లేట్రీ.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!) -
అమ్మపాలు.. అమృతం..
లబ్బీపేట(విజయవాడతూర్పు): బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల, మెదడు ఎదుగుదలతో పాటు, పిల్లలు చురుగ్గా ఉండేలా చేస్తాయి. కానీ పాశ్చాత్య సంస్కృతితో భాగంగా కొందరు సౌందర్యం తగ్గుతుందని మరికొందరు ఉద్యోగరీత్యా తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదు. ఇలాంటి చర్యలతో బిడ్డలతో సహా తామూ నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావం గురించి అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శిశు మరణాల నివారణ....ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాస కోశవ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయని యూనిసెఫ్ గుర్తించింది. అలాటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే అవగాహన కలిగిస్తున్నారు.తల్లికీ ప్రయోజనాలు....బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని అంటున్నారు. అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని పేర్కొన్నారు.శిశువులకు ఎంతో మేలు⇒ తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి.⇒ తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు.⇒ మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.⇒ పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను వడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది.⇒ ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటాయి.⇒ శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.⇒ పుట్టిన అరగంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలి తల్లిపాలతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుదల తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువ నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలుతల్లిపాలు శ్రేష్టమైనవిబిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. శిశువుకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవం అయితే పుట్టిన అరగంటలోపు, సిజేరియన్ అయితే నాలుగు గంటల్లోపు తల్లిపాలు పట్టించాలి. ముర్రుపాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉండటంతో పాటు తెలివితేటలు, జ్ఞాపకశక్తి మెండుగా ఉంటాయి.– డాక్టర్ బి.సునీత, అసోసియేట్ ప్రొఫెసర్, పిల్లల వైద్య విభాగం, జీజీహెచ్ -
పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు
అదేమిటో కానీ, మన ఇంటి వంట కంటే పక్కింటి పోపుకే ఘుమఘుమలు ఎక్కువ. మన పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం ఉడిపి వాళ్ల ఆరోగ్యవంటలకు మన వంటింట్లో పోపు వేద్దాం. పాలిచ్చే తల్లి ఏమి తినాలో ఉడిపి వాళ్ల మెనూ చూద్దాం. సొప్పు పాల్య కావలసినవి: ►పాలకూర – 2 కట్టలు ►ఉల్లిపాయ– 1 (తరగాలి) ►ఉప్పు – అర టీ స్పూన్ ►మిరియాల పొడి– టీ స్పూన్. ►పోపు కోసం: నెయ్యి– 2 టీ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ: ►పాలకూరను శుభ్రం చేసి తరగాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. ►అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►ఆ తర్వాత కరివేపాకు వేయాలి. ►ఇప్పుడు పాలకూర, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టి సన్న మంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి (ఆకులోని నీటితోనే మగ్గుతుంది). ►దీనిని పాలిచ్చే తల్లికి రెండు రోజులకొకసారి పెడతారు. మోహన్ లడ్డు కావలసినవి: ►గోధుమ పిండి– కప్పు ►బియ్యప్పిండి– టేబుల్ స్పూన్ ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►చక్కెర– కప్పు ►నీరు – అర కప్పు ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►నూనె – పూరీలు కాలడానికి తగినంత. తయారీ: ►వెడల్పు పాత్రలో గోధుమపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నీటిని పోస్తూ ముద్దగా కలపాలి. ►బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండినంతటినీ పూరీలు చేసుకోవాలి. ►మోహన్ లడ్డు కోసం చేసే ఈ పూరీలు మెత్తగా ఉండకూడదు, కరకరలాడాలి. ►చల్లారిన తరవాత వీటిని తుంచి చిన్న ముక్కలు చేయాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పూరీ ముక్కల్లో కలపాలి. ►ఒక పాత్రలో చక్కెర వేసి, నీరు పోయాలి. చక్కెర కరిగిన తరవాత, యాలకుల పొడి వేసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యే వరకు మరిగించాలి. ►ఈ చక్కెర పాకాన్ని పూరీ ముక్కల మీద పోస్తూ లడ్డు చేయాలి. ఇది ఉడిపి స్పెషల్. చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. Facial Brush: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్ ధర ఎంతంటే! -
తల్లిపాలలోనూ ప్లాస్టిక్!
సాక్షి, హైదరాబాద్: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్‌తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు. రకరకాలుగా కలుషితం ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిందే.. భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఐసీఎంఆర్ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి తల్లిపాలలో ప్లాస్టిక్‌తోపాటు లెడ్ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో ఉండే ఆహారం తీసుకోవద్దు. – డాక్టర్ బబిత మాటూరి, సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమాదం ఎంత వరకు? తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. -
తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు. బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది. కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్ నగరంలో ధాత్రి మిల్క్ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్‌కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్‌ను జీర్ణం చేసుకోలేరు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్ భవాని. చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్ డొనేషన్‌ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్‌మిల్క్ స్టోరేజ్ పౌచ్’లను ఇస్తారు. తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్‌లో పోసి ఇంట్లోనే డీప్‌ఫ్రీజర్‌లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్‌లను కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్‌ఫ్రీజర్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఇలా మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్‌బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు. పాలదాతలు తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్ డోనర్ మదర్లకు మేము పౌచ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్‌ను డీప్ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్‌లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్ డోనర్ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు. డా. భవాని కలవలపల్లి పీడియాట్రీషియన్ , వైస్ ప్రెసిడెంట్, సుశేన హెల్త్ ఫౌండేషన్ సీఈవో, ఐడియా క్లినిక్స్ ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్‌వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవేర్నెస్ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్‌వో. ఈ ఏడాది ‘స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్–ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్’ థీమ్‌తో ముందుకెళ్తోంది. – వాకా మంజులారెడ్డి -
‘చిట్టి’ తల్లి.. చనుబాలతో ఎందరో బిడ్డల ఆకలి తీర్చాలనుకుంది!
సాల్ట్ లేక్ సిటీ: బిడ్డల ఆకలిని తీర్చేందుకు అక్కడి తల్లులు పడుతున్న అవస్థలు చూసి ఓ తల్లి చలించిపోయింది. విమర్శలు ఎదురవుతాయని తెలిసినా.. ఒక అడుగు ముందుకు వేసింది. తన చనుబాలను ఇచ్చి ఎంతో మంది బిడ్డల ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. అమెరికా యూటా చెందిన అలైస్సా చిట్టి తన ఇంట్లో మూడు ఫ్రీజర్ల నిండా చనుబాలను నిల్వ చేసి ఉంచింది. మొత్తం పాల క్వాంటిటీ 118 లీటర్లు!!. తొలుత ఆమె ఉచితంగానే పాలను పంచాలని అనుకుందట. అయితే మిల్క్ బ్యాంక్‌ల నుంచి పాలు పంచే పద్ధతి సుదీర్ఘంగా ఉండడం, అదే జరిగితే ఆలస్యం అవుతుందనే ఆలోచనతో ఆమె ఈ ఉపాయం చేసింది. ఔన్స్ పాలకు డాలర్ వసూలు చేయడం మొదలుపెట్టి.. తల్లులకు పాలు పంచుతోంది. చిట్టి ఈ పని మొదలుపెట్టినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తల్లి పాలతో వ్యాపారం చేస్తోందంటూ కొందరు మండిపడ్డారు. కానీ, పద్ధతి ప్రకారం వెళ్తే ఆమె అనుకున్న పని జరగదు. అందుకే ఇలా.. అమ్మకం ద్వారా పంచుతోంది. బేబీ ఫార్ములా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ ఫార్ములా(బిడ్డ ఆకలి తీర్చే ఉత్పత్తుల) కొరత కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా 40 శాతం బేబీ ఫార్ములా ఔట్ ఆఫ్ స్టాక్‌గా ఉంది. ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ప్రొడక్షన్ ప్లాంట్ మూతపడిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొంది. బేబీ ఫార్ములా అనేది ఏడాది లోపు పసికందులకు ఇచ్చే అథెంటిక్ ఫుడ్. తన బిడ్డ కూడా ఆ తరహా ఫుడ్‌కు అలవాటు పడిందనేనని, ఆ కష్టాలేంటో తెలిసే ఇలా సాయం చేస్తున్నానని అలైస్సా చిట్టి అంటోంది. అయితే ఆమె ఇంటర్వ్యూ తర్వాత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎదురుకావడంతో.. ప్రస్తుతానికి చనుబాలను అమ్మే ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఆమె ఆపేసింది. ఎందుకు అడ్డంకులు.. అమెరికాలో ఆన్లైన్లో తల్లి పాలను కొనుగోలు చేయడం, విక్రయించడం ఖచ్చితంగా చట్టబద్ధమైనదే అయినా నియంత్రణ లేని వ్యవహారం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాల ప్రకారం.. తల్లి పాలను నేరుగా వ్యక్తుల నుంచి లేదంటే ఆన్లైన్ ద్వారా పొందినప్పుడు.. దాత అంటు వ్యాధులు లేదంటే నాణ్యత ప్రమాణాల కోసం పరీక్షించబడే అవకాశం ఉండదు. అదే ఒకవేళ పాలను మిల్క్ బ్యాంకుకు విరాళంగా ఇవ్వడం వల్ల వారాల తరబడి స్క్రీనింగ్ ఉంటుంది. అందుకే మిల్క్ బ్యాంకుల ద్వారానే పంచాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. -
తల్లిలో బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే...?
కొత్తగా అమ్మగా మారిన తల్లిలో తగినన్ని పాలు పడకపోతే ఆమె తల్లడిల్లిపోతుంది. ఇలాంటివారు చిన్నారికి సరిపోయినంతగా పాలు పడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీంతో ఆమె ఆరోగ్యం బాగుపడటంతో పాటు, బిడ్డకూ తగినన్ని పాలు సమకూరతాయి. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త తల్లులు, అలాగే చాలామంది ఇళ్లలోని పెద్దవాళ్లలో ఓ అపోహ ఉంటుంది. సిజేరియన్ సహాయంతో బిడ్డను తీసిన మహిళల్లో, ఆ కుట్లు చీము పడతాయనే అపోహతో... వారికి పప్పుధాన్యాలు ఇవ్వరు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపప్రధ తో ద్రవపదార్థాలనూ, బిడ్డకు జలుబు చేస్తుందనే అభిప్రాయంతో పండ్లను తిననివ్వరు. దాంతో తల్లికి పాలు సరిగ్గా పడవు సరికదా... ఆమెకు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. ఇక కొందరు తల్లుల్లో తగినన్ని పాలు ఊరకపోవడంతో... బిడ్డకు సరిపడినన్ని పాలు అందించడం కోసం వెంటనే పోతపాలను అలవాటు చేస్తారు. పోతపాలు రుచిగా ఉండటంతో బిడ్డ వాటికి అలవాటు పడటం చాలా సాధారణం. అటు తర్వాత చిన్నారులు తల్లి దగ్గర తాగడానికి ఇష్టపడరు. దాంతో బిడ్డ పాలు తగడం తగ్గించడంతో తల్లి దగ్గర తగినన్ని పాలు ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. ఇలా పాలు ఊరడం తగ్గిపోడానికి ఇది కూడా ఒక కారణమే. బిడ్డకు తల్లిదగ్గరి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోడానికి ఓ మార్గం ఉంది. తాగిన తర్వాత బిడ్డ... రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రపోతున్నా, రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా, వయసుకు తగినట్లు బరువు పెరుగుతున్నా... తల్లి పాలు బిడ్డకు సరిపోతున్నట్లు లెక్క. ఒకవేళ నిజంగానే అమ్మ దగ్గర బిడ్డకు సరిపడినన్ని పాలు పడనట్లయితే... తల్లి తన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అందేలా మంచి బలవర్థకమైన ఆహారంతోపాటు... అందులో మరీ ముఖ్యంగా నువ్వులు, వెల్లుల్లి, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగేలా చూడాలి. ఆ తర్వాత కూడా బిడ్డకు ఇంకా పాలు సరిపోక పోయినట్లయితే డాక్టర్ సలహా తీసుకోవాలి. -
తల్లి పాలతో.. ఆ అమ్మ కోట్లు సంపాదిస్తోంది!
తల్లి పాలతో ఆభరాల తయారీ.. వినడానికి వింతగా, ఒకింత ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. కానీ, ఇందులో ఎలాంటి తప్పు లేదని అంటోది లండన్‌కు చెందిన ఓ జంట. పైగా ఈ ఆభరణాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఎంతో ఉందని చెప్తున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన సఫియ్యా రియాద్, ఆమె భర్త అడమ్ రియాద్లు ఈ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎలాగో వాళ్ల మాటల్లోనే.. ‘మాది బెక్సెలె(లండన్). నేను, నా భర్త ఆడమ్ రియాద్ ‘మాగ్నెట ఫ్లవర్స్’ 2019లో ఓ ఒక కంపెనీని నెలకొల్పాం. ఈవెంట్లకు పూల సరఫరా చేస్తూ.. ఈవెంట్ అయిపోగానే ఆ పూలనే కస్టమర్లకు మధురైన జ్ఞాపకార్థాలుగా మార్చేసి ఇస్తాం. ఆ సమయంలో నాలుగు వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. అయితే ఆ మరుసటి ఏడాదే కరోనా వచ్చి పడింది. కరోనా టైంలో వ్యాపారం అరకోరగా సాగింది. ఒకరోజూ నేనూ నా భర్త.. తల్లి పాలతో ఆభరణాల తయారీ ఆర్టికల్ చదివాం. ఆ ఐడియా ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే మెజంటా ఫ్లవర్ నుంచే ఈ ఐడియాను అమలు చేస్తున్నాం. భద్రపరిచిన పాలను.. విలువైన రాళ్లుగా మార్చడమే ఆభరణాల తయారీలో కీలకం. ఇందుకోసం చాలా స్టడీస్ చేశాం. ఈ పద్ధతిలో.. ముందుగా పాలను డీహైడ్రేట్ చేస్తారు. ఆపై హైక్వాలిటీ నాన్ ఎల్లోయింగ్ రెసిన్‌ను మిక్స్ చేస్తారు. ఆపై ఆ గట్టి రాయిని.. నెక్లెస్, చేతి రింగులు, చెవి పోగులుగా అద్దుతారు. పైన చేసిన కెమికల్ రియాక్షన్ వల్ల తల్లిపాలతో చేసిన ఆ రాయి చాలాకాలం మన్నుతుంది కూడా. ఇదేం వ్యాపారం చెండాలంగా.. అని విమర్శించే వాళ్లకు ఆమె సమాధానం కూడా అంతే గట్టి సమాధానం ఇస్తోంది. ‘‘తల్లి పాల ఆభరణాలతో సెంటిమెంట్ కనెక్టివిటీ ఉంటుంది. సిగ్గు పడేంత తప్పు కాదు.. అది అమ్మల కోసమే!. వాళ్ల జీవితాల్లో ఏదైనా సందర్భాల్లో వీటిని పంచుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఇది హాట్ బిజినెస్‌గా మారింది. పైగా వీటి తయారీ కోసం కస్టమర్ల(ఆ తల్లుల) దగ్గరి నుంచే 30 మిల్లీలీటర్ల పాలను సేకరిస్తున్నాం. ఎందుకంటే అది వాళ్ల జ్ఞాపకాలకు సంబంధించింది కదా. అంటోంది సఫియ్యా రియాద్. దీనికి తోడు మతపరంగా వస్తున్న విమర్శలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ భార్యాభర్తలు.. తల్లి పాల ఆభరణాలతో కోట్లు సంపాదిస్తున్నారు. 2023 ఏడాది కోసం 1.5 మిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్ల) మేర టర్నోవర్ సాధిస్తున్నట్లు ప్రకటించుకుంది ఈ జంట. -
Breast Milk: తల్లిపాలు పెరగాలంటే.. బొప్పాయి కూర, ఆవుపాలు, కర్బూజ, జీలకర్ర ఇంకా
Best Foods Increase Breast Milk Production: పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు, పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. అయితే కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటివారు కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణులకు బొప్పాయి ఇవ్వకూడదని అందరికీ తెలుసు. అదే బొప్పాయి బాలింతలకు కల్పతరువులా పనిచేస్తుంది. దోరగా ఉన్న బొప్పాయికాయను కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి! ►ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు చాలా మేలు చేస్తాయి. ►పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి. ఆయుర్వేద దుకాణాల్లో శతావరి పేరిట చూర్ణం దొరుకుతుంది. ఇది కూడా బాగానే పని చేస్తుంది. ►రెండు గ్లాసుల నీళ్ళలో రెండు టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది. ►తామర కాడను ఎండించిన చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి. ►ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. ►బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. ►శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి. ►బాలింతలకు జలుబు చేస్తుందని మంచినీళ్లు ఎక్కువ తాగనివ్వరు పెద్దలు. అలా కాకుండా తగినన్ని మంచి నీళ్లు తాగుతుండాలి. కాకపోతే చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది. ►మజ్జిగ, పెరుగు, పాలు పుష్కలంగా తీసుకోవాలి. ►ఇవన్నీ అంతో ఇంతో పాలు పడే తల్లులకు పని చేస్తాయి. అయితే కొందరు తల్లులకు కొన్ని కారణాల వల్ల పాలు అసలు పడవు. అటువంటప్పుడు ప్రయోజనం ఏముందని పిల్లలను రొమ్ముకు దూరం పెడతారు తల్లులు. అలా చేయకూడదు. పిల్లలు రొమ్మును చప్పరించడం వల్ల తల్లిలో మాతృత్వ భావన ఉప్పొంగి హార్మోన్ల ప్రేరణతో పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలతోబాటు వైద్యులు కూడా చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
తల్లిపాలు: పాలిచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లి పాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి. ఎన్నోరకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.? రోజుకు ఎన్నిసార్లు పట్టాలి.? ఎలా పట్టాలి.? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి.? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.? ఇలా చాలా అంశాలపై అందరికి అవగాహన ఉండదు. ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ. ఇలాంటి అంశాలను వారికి తెలియజేస్తూ, తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలను ఆగస్టు 7వ తేదీ వరకు కోవిడ్–19 నేపథ్యంలో టీ శాట్ ద్వారా నిర్వహించనున్నారు. సాక్షి, మంచిర్యాల: బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రీములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8–10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలిచ్చే సమయంలో ఇవి తీసుకోకూడదు.. ♦ బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. ♦ పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముర్రుపాలు తప్పనిసరి ♦ బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ♦ ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ♦ వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి. ♦ శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి. ♦ తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే. ♦ బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే... ♦ గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ♦ ఆహారంలో తీపి పదార్థాలు(స్వీటు కాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు తినాలి. తల్లికి కలిగే లాభాలు.. ♦ తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ♦ చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు. ♦ బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. ♦ తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. ♦ తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. ♦ ఆరు నెలల వరకు రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ♦ తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలతో కలిగే లాభాలు ► తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ► నాణ్యమైన ప్రోటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. ► ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఇందులోని లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ► తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారినుంచి కాపాడుతాయి. ► తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ► ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు. ► బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనవి ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా, టీ శాట్ ద్వారానే చిన్నారులకు ప్రీస్కూల్ పాఠాలను బోధిస్తున్నాం. గర్భిణులు కరోనా సమయంలో మరింత జాగ్రత్తలను తీసుకుని, పుట్టే బిడ్డలకు తల్లిపాలనే అందించాలి. – ఉమాదేవి, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి -
‘అమ్మ’గా మారిన కానిస్టేబుల్
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు... ఒక గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన చిన్నారికి విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ భార్య (ఆమె కూడా కానిస్టేబుల్ )తల్లిపాలిచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వారి బాబుకు ఓ బహుమతిని అందించారు. ఈ ఏడాది చివరి రోజు సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సీపీ అంజనీకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘మమ’కారం చాటారు.. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలో యాఖత్‌పురా వాసి ఇర్ఫాన్ వద్దకు మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ వచ్చింది. కొద్దిసేపు పక్కనే నిలబడి.. తాను మంచినీళ్లు తీసుకొస్తానని, రెండు నెలల పాపను ఎత్తుకోమంటూ ఇర్ఫాన్‌కు అందించి కనిపించకుండా పోయింది. పాపను ఇచ్చిన తల్లి తిరిగి వెనక్కి రాకపోవడంతో ఏమి చేయాలో తోయని ఇర్ఫాన్ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పారు. పాపను రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఈ–కాప్స్ కానిస్టేబుల్ రవీందర్‌కు అప్పగించారు. ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుంది. తన భార్య ప్రియాంక బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రసూతి సెలవులపై ఉంది. రవీందర్, తన చేతిలోని పాప విషయాన్ని భార్యకు వివరించాడు. పాప ఏడుపులను ఫోన్లో విన్న ప్రియాంక చలించిపోయి, వెంటనే క్యాబ్ తీసుకొని అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. వచ్చిన వెంటనే ఆ పాపను హత్తుకొని, తల్లిపాలిచ్చింది. ఆకలితో ఉన్న పాప, తల్లిపాలు తాగిన తరువాత ఏడుపును ఆపి నిద్రపోయింది.అనంతరం పాపను పేట్లబురుజు ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లికి పాప అప్పగింత. .. పాపను పోలీస్‌స్టేషన్‌కు తెచ్చిన ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయం వేళల్లో ఎఎస్సై ఎండీ తాహెరుద్దీన్ ఆధ్వర్యంలో పాప తల్లి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చంచల్‌గూడ ప్రాంతంలో ఒక మహిళ ఏడుస్తూ పోలీసుల కంట పడింది. పాప పోయిందంటూ ఆమె ఏడుస్తుండడంతో పోలీసులు ఆరా తీశారు. ఫలక్‌నుమాకు చెందిన షాబాన బేగం చిత్తుకాగితాలు ఏరుకుంటుందని, ఆమె భర్త ఫిరోజ్కాన్ పాత నేరస్థుడని ఇటీవల సెల్‌ఫోన్ దొంగతనం కేసులో అఫ్జల్‌గంజ్ పోలీసులు జైలుకు పంపించినట్లు విచారణలో తేలింది. కల్లు తాగేందుకు అలవాటు పడ్డ షాబానకు ఇద్దరు ఆడ పిల్లలకు ఒక పాప ఐదేండ్ల ఫాతిమా కాగా, మరో పాప రెండు నెలల పాప అని పోలీసులు నిర్ధారించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పాపను ఆమెకు అందించారు. -
పాము రూపంలో మృత్యువు వెంటాడింది..
లక్నో : పాముకాటుకు రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరవగా, అది తెలియని చిన్నారి తల్లి పాలు తాగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురైన తల్లి అది తెలియక తన చిన్నారికి చనుబాలు ఇవ్వటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యూపీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ నిద్రలో ఉండగా పాము కాటుకు గురైంది. అయితే నిద్రలో ఏదో పురుగు కుట్టి ఉంటుందనుకున్న ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. ఇంతలో మూడేళ్ల చిన్నారి తల్లిపాలు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లీకూతుళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించారు. కొద్దిసేపటి తర్వాత వారి కుటుంసభ్యులు ఇంట్లోని ఓ గదిలో పామును గుర్తించారు. తల్లి,కూతురు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు. కాగా భారతదేశంలో 300రకాల పాము జాతులు ఉండగా ఇందులో 60 జాతులు మాత్రమే విషపూరితమైనవి. దేశంలో ప్రతిఏడాది పాము కాటుకుగురై మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. -
చనుబాలను దానం చేసిన అమ్మలారా.. వందనం!
జైపూర్ : మరొకరికి పుట్టిన శిశువులకు సైతం తమ చనుబాలను అందిస్తూ అమ్మ పదానికి అసలైన అర్థం చెబుతోన్న మహిళలను రాజస్థాన్ ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. రాష్ట్రంలోని 11 హ్యూమన్ మిల్క్ బ్యాంకు(తల్లిపాల బ్యాంకు)ల్లో పాలను దానం చేస్తోన్నవారి నుంచి 33 మందిని ఎంపిక చేసి, గాంధీ జయంతి(అక్టోబర్ 2న) జరగనున్న కార్యక్రమంలో సన్మానించనుంది. ఈ మేరకు రాజస్థాన్ ఆంచల్ మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్టు సలహాదారు దేవేంద్ర అగర్వాల్ శనివారం ఒక ప్రకటన చేశారు. ఏమిటీ హ్యూమన్ మిల్క్ బ్యాంకు? : నవజాత శిశువులకు తల్లిపాల అవసరం ఎంతో అందరికీ తెలిసిందే. అయితే, కొందరు మహిళలకు పాలు పడని కారణంగా, వారికి పుట్టే పిల్లలు తల్లిపాలు లేక ఎదిగే క్రమంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ లోపాన్ని పూడ్చుతూ, జాతికి బలమైన పౌరులను అందించే దిశగా ఆయా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘మదర్ మిల్క్ బ్యాంకు’లను ఏర్పాటుచేశాయి. విదేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ తరహా విధానం భారత్‌లో కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 1989లో ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మొట్టమొదటి మదర్ మిల్క్ బ్యాంకును ఏర్పాటుచేశారు. ప్రముఖ యోగా గురు దేవేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్‌లో ప్రారంభించిన తల్లిపాల బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 11 హ్యూమన్ మిల్క్ బ్యాంకులున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 17గా ఉన్నట్లు అంచనా! పూర్తి ఉచితంగా : రాజస్థాన్‌లో ఇప్పటివరకు 10,157 మంది తల్లులు.. 22లక్షల మిల్లీలీటర్ల పాలను ఇతరులకు దానం చేశారు. 7,513 మంది నవజాత శిశువులకు 56,191 యూనిట్ల (ఒక్కో యూనిట్= 30ఎం.ఎల్) పాలను పట్టించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని మదర్స్ మిల్క్ బ్యాంకుల్లో 6,605 యూనిట్ల తల్లిపాలను నిలువ ఉంచారు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా, పూర్తి ఉచితంగా ఈ కార్యక్రమం కొనసాగుతుండటం విశేషం. మూడు విభాగాల్లో అవార్డులు : అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో మొత్తం మూడు విభాగాల్లో మహిళలకు అవార్డులు అందించనున్నారు. 1. వాత్సల్య అవార్డు(మొదటిసారి తల్లిపాలను దానం చేసిన వారికి), 2.ఆంచల్ కల్యాణి అవార్డు (ఎక్కువసార్లు పాలను దానం చేసిన తల్లులకు), 3.ఆంచల్ అమృత్ దా అవార్డు (ఎక్కువ మొత్తంలో పాలు దానం చేసిన తల్లులకు) విభాగాల్లో పురస్కారాలు అందిస్తారు. రాజస్థాన్‌తో పోల్చితే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మదర్స్ మిల్క్ బ్యాంకుల ఏర్పాటుపై ప్రభుత్వాలు శ్రద్ధచూపడం లేదన్నది నిర్వివాదాంశం. పౌష్టికాహారలోపంతో 5ఏళ్ల లోపు పిల్లల మరణాలు అధికంగా ఉండే దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్.. తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేపట్టినప్పట్టింది. కానీ మిల్క్ బ్యాంకుల ఏర్పాటు, విస్తృతిపై మాత్రం అవసరమైన మేర ప్రణాళికలు రూపొందించకపోవడం శోచనీయం. (ఫొటో స్లైడ్ చూడండి..) -
రొమ్ము పాలతో బ్రెస్ట్ కేన్సర్ గుర్తింపు
బోస్టన్: రొమ్ము పాలలోని ప్రొటీన్ల తీరును బట్టి బ్రెస్ట్ కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చని తేలింది. యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను గుర్తించడంలో ఇప్పుడున్న మామోగ్రఫీ, ఇమేజింగ్ పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావని, యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కణజాలాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. రొమ్ము పాలు, కన్నీళ్లు, మూత్రం, లాలాజలం, సీరం వంటి ద్రవాల్లోని ప్రొటీన్ల తీరులను పర్యవేక్షించడం ద్వారా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చని మసాచూసెట్స్ వర్సిటీ పరిశోధకులు వివరించారు. పరిశోధనలో భాగంగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలు, రొమ్ము కేన్సర్ లేని మహిళల పాలను పోల్చి చూశారు. రొమ్ము కేన్సర్ వ్యాధికి కారణంగా భావించే ఎపిథియల్ కణాలను పరీక్షించేందుకు రొమ్ము పాలు ఉపయోగపడతాయని వెల్లడించారు. -
కంబోడియాలో తల్లిపాల ఎగుమతిపై నిషేధం
పెనోంపెన్: కంబోడియా తల్లులనుంచి సేకరించిన పాలను ఎగుమతి చేస్తున్న ఓ కంపెనీ కార్యకలాపాలను ఆ దేశం తాత్కాలికంగా స్తంభింపజేసింది. కొంతమంది నిరుపేద మహిళలు తమ బిడ్డలకు ఇవ్వాల్సిన పాలను అమ్ముకుని జీవనానికి అవసరమైన డబ్బును సమకూర్చుకుంటున్నారని కొన్ని నివేదికలు పేర్కొనడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన ఆంబ్రోసియా ల్యాబ్స్ అనే కంపెనీ కాంబోడియాలో మహిళల నుంచి పాలను సేకరించి.. ఘనీభవింపజేసి, అమెరికాకు తరలించి విక్రయిస్తోంది. 147 మిల్లీ లీటర్ల పాల ప్యాకెట్‌ను 20 డాలర్లకు (రూ.1,300) విక్రయిస్తోంది. తమ బిడ్డలకు తల్లి పాలు ఇవ్వలేని అమెరికా మహిళలు వీటిని కొంటున్నారు. ఈ కంపెనీ కాంబోడియా తల్లులకు రోజుకు దాదాపు రూ.500 చెల్లించేది. ఆసియాలోనే అతి పేద దేశాల్లో కాంబోడియా ఒకటి. -
14.8 లీటర్ల అమ్మపాలు.. నేలపాలు!
పిల్లలకు అమ్మపాలను మించిన అమృతం లేదు. అలాంటి అమృతతుల్యమైన పాలను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ అధికారులు వృథాగా పారబోయడంపై ఓ మాతృమూర్తి ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల తన చంటిబిడ్డ కోసం తీసుకెళుతున్న 14.8 లీటర్ల అమ్మపాలను నిబంధనలు అనుమతించవంటూ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ పాలను పారబోసిన తర్వాతే ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ అమెరికాకు చెందిన జెస్సికా కోక్లే మార్టినెజ్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ పోస్టులో ఆమె వివరించింది. తన 8 నెలల బిడ్డ కోసం అమ్మపాలు తీసుకొని వెళ్లకుండా అడ్డుకొని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అవమానించారని, 8 నెలల తన పసిబిడ్డ రెండు వారాల ఆహారాన్ని దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీత్రూ విమానాశ్రయం మాత్రం లండన్‌లోని నిబంధనల ప్రకారం ద్రవపదార్థాలు విమానంలో తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, అత్యవసరమైన ద్రవపదార్థాలు మాత్రమే 100 ఎంఎల్‌కు మించకుండా తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు. బిడ్డ వెంట ఉంటేనే తల్లిపాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారని వివరణ ఇచ్చారు. అయితే, తాను ప్రయాణిస్తున్న సమయంలో తన చంటిబిడ్డ వెంటలేదని, అయినా అమ్మపాల విషయంలోనూ ఇంత కఠినంగా వ్యవహరించడం సమంజసం కాదని, ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసే తనలాంటి తల్లులకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరుతున్నది. -
చైనా తల్లుల పాలు మరింత శ్రేష్ఠం
చైనాలో తల్లిపాలు తాగే పిల్లలు అమెరికా, మెక్సికో పిల్లల కంటే ఎక్కువ అదృష్టవంతులట. ఎందుకంటే.. చైనా తల్లులకు ఆరోగ్యాన్ని సంరక్షించే కరోటెనాయిడ్లు అనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. కరోటెనాయిడ్లు సాధారణంగా మొక్కల నుంచి వస్తాయి. ఇవి మానవాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.. అలాగే విటమిన్ ఎ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలోనూ ఎ విటమిన్ పాత్ర కీలకం. పిల్లలు పుట్టిన రెండు వారాల తర్వాత తల్లిపాలలో ఉండే కరోటెనాయిడ్లను పరిశీలిస్తే.. చైనా తల్లుల పాలలో కంటే అమెరికా తల్లుల పాలలో ఇవి 40 శాతం తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే మెక్సికన్ తల్లుల పాలలో కూడా అమెరికా వాళ్ల కంటే 25 శాతం ఎక్కువగా కరోటెనాయిడ్లున్నాయి. చైనా మెక్సికోలతో పోలిస్తే అమెరికాలో పండ్లు, కూరగాయలు తక్కువగా తినడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోటెనాయిడ్లు పసి పిల్లలతో పాటు తల్లులకు కూడా చాలా ముఖ్యమని పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మారియో ఫెరుజి తెలిపారు. గర్భిణులు తప్పనిసరిగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని, ముఖ్యంగా ఆకు కూరలు, పచ్చటి పండ్లు బాగా తినాలని సూచించారు.