ప్రతీకాత్మక చిత్రం
లక్నో : పాముకాటుకు రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరవగా, అది తెలియని చిన్నారి తల్లి పాలు తాగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురైన తల్లి అది తెలియక తన చిన్నారికి చనుబాలు ఇవ్వటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యూపీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ నిద్రలో ఉండగా పాము కాటుకు గురైంది. అయితే నిద్రలో ఏదో పురుగు కుట్టి ఉంటుందనుకున్న ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. ఇంతలో మూడేళ్ల చిన్నారి తల్లిపాలు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లీకూతుళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించారు.
కొద్దిసేపటి తర్వాత వారి కుటుంసభ్యులు ఇంట్లోని ఓ గదిలో పామును గుర్తించారు. తల్లి,కూతురు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు. కాగా భారతదేశంలో 300రకాల పాము జాతులు ఉండగా ఇందులో 60 జాతులు మాత్రమే విషపూరితమైనవి. దేశంలో ప్రతిఏడాది పాము కాటుకుగురై మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment