ప్రతీకాత్మక చిత్రం
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. బీజేపీ నాయకుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ నౌగామ్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర శివార్లలోని నౌగామ్, అరిగం ప్రాంతంలోని బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటి బయట గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌తో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సెంట్రీని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు హస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నజీర్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా, పార్టీ కశ్మీర్ యూనిట్ ఈ దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మంజూర్ భట్ తెలిపారు.
#NewsAlert | One cop martyred as terrorists target guard post outside BJP leader's residence in Naugam, J&K.
— TIMES NOW (@TimesNow) April 1, 2021
Details by Ieshan & Sohil. pic.twitter.com/rjjqDAgaw7
Comments
Please login to add a commentAdd a comment