కశ్మీర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి  | Few Cops Killed, Several Hurt As Terrorists Open Fire On Police Bus | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి 

Published Mon, Dec 13 2021 9:23 PM | Last Updated on Tue, Dec 14 2021 8:31 AM

Few Cops Killed, Several Hurt As Terrorists Open Fire On Police Bus - Sakshi

Terrorists Open Fire On Police Bus: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం సాయంత్రం పంథా చౌక్‌లోని జెవాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సాయుధ పోలీసు బలగాలను తీసుకెళ్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. దీంతో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు చనిపోగా మరో 12 మంది పోలీసులు గాయపడ్డారు.

చదవండి: మసాజ్‌ సెంటర్‌లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌

క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనతో అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, తనిఖీలు చేపట్టాయి. శ్రీనగర్‌ శివారులోని రంగ్‌రేత్‌ ప్రాంతంలో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు విదేశీయుడని పోలీసులు తెలిపారు.  సరిహద్దుల గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళను భద్రతాబలగాలు కాల్చి చంపాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement