అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు | US Man Opens Fire At Children's Water Park, Several Injured | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు

Jun 16 2024 9:32 AM | Updated on Jun 16 2024 1:45 PM

US Man Opens Fire At Children's Water Park, Several Injured

మిచిగాన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని ఓ చిల్డ్రన్స్ వాటర్ పార్క్‌ వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. దీంతో అక్కడ ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మందికి గాయలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

 

 శనివారం సాయంత్ర 5 గంటలకు  చిల్డ్రన్స్ పార్క్‌కు వద్ద గుర్తు తెలియని వ్యక్తి  బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు మిషిగాన్‌పోలీసులు తెలిపారు. పలుసార్లు అతడు గన్‌లోడ్‌ చేసుకొని మరీ 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ​అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటివల అమెరికాలోని ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వరుస ఘటనలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement