Children Park
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు
మిచిగాన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని ఓ చిల్డ్రన్స్ వాటర్ పార్క్ వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. దీంతో అక్కడ ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మందికి గాయలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.US Shooting: Nine Including Children Injured After Gunman ‘Randomly’ Opens Fire at Splash Pad in Michigan’s Rochester Hills, SWAT Team Mobilised (Watch Videos)https://t.co/tzoa7U1wtM#US #Michigan #RochesterHills #Shooting— LatestLY (@latestly) June 16, 2024 శనివారం సాయంత్ర 5 గంటలకు చిల్డ్రన్స్ పార్క్‌కు వద్ద గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు మిషిగాన్పోలీసులు తెలిపారు. పలుసార్లు అతడు గన్‌లోడ్ చేసుకొని మరీ 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటివల అమెరికాలోని ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వరుస ఘటనలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
పిల్లల గణతంత్ర ప్రపంచం!
ఇది ఒక అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. దీని పేరు చిల్డ్రన్స్ రిపబ్లిక్. ఈ పార్కు లోపలి వాతావరణం పూర్తిగా పేరుకు తగినట్లుగానే ఉంటుంది. అర్జెంటీనాలోని మాన్యువల్ బి గానెట్ నగరంలో ఉందిది. దేశంలోని పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అర్జెంటీనా ప్రభుత్వం 1951 నవంబర్ 26న ఈ పార్కును ప్రారంభించింది. ఈ పార్కు నిర్మించిన 130 ఎకరాల స్థలంలో అంతకు ముందు గోల్ఫ్‌కోర్స్ ఉండేది. ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని, ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందులో నగరాలు, పట్టణాలు, పల్లెల నమూనాలు, తాజ్‌మహల్ స్ఫూర్తితో నిర్మించిన ‘ప్యాలెస్ ఆఫ్ కల్చర్’, పిల్లల బ్యాంకు, ఆక్వేరియం, పిల్లల పార్లమెంటు వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్కులోని పిల్లల బృందాలు పిల్లల పార్లమెంటు కోసం తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారు. అందరూ కలసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!) -
తకదిం'థీమ్'
సిటీలో పార్కులు ఇక కొత్తరూపు సంతరించుకోనున్నాయి.ప్రతి పార్కుకూ ఓ థీమ్ ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఈ థీమ్‌లు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఉంటాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.120 కోట్లు వ్యయం చేయనున్నది. ఈ మేరకుగ్రేటర్ వ్యాప్తంగా 47 పార్కుల్ని తీర్చిదిద్దాలని అధికారులునిర్ణయించారు. ఇవీ థీమ్స్.. స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్, ఇంకుడుగుంతలు, చిల్డ్రన్స్, తెలంగాణ కల్చర్, వేస్ట్ టు వండర్స్ ఆఫ్ తెలంగాణ, పేట్రియాటిక్, యూనివర్సల్, టన్నెల్గార్డెన్, నాలెడ్జ్ ఆన్ సైన్స్, రెయిన్‌ఫారెస్ట్, వాటర్, అడ్వెంచర్, ఎనర్జీ కన్జర్వేషన్, ఉమెన్, సీనియర్ సిటిజెన్, పార్క్ ఆఫ్ సెన్సెస్, కాళేశ్వరం తదితర థీమ్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. సాక్షి,సిటీబ్యూరో: కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కు లేదు. అలాంటి ఒక పార్కు త్వరలో ఏర్పాటు కానుంది. అందులో కేవలం పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పిల్లలుంటేనే వారి వెంట పెద్దలకు ప్రవేశం ఉంటుంది. పిల్లల్లేకుండా కేవలం పెద్దలే వస్తే ప్రవేశం ఉండదు. ఈ చిల్డ్రన్స్ పార్కులో 3–14 ఏళ్ల మధ్య వయసు పిల్లల కోసం ఆయా ఆకర్షణలు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. డ్రాయింగ్, సంగీతం,డ్యాన్స్ వంటివి నేర్చుకోవాలనుకునేవారికి తర్ఫీదునిచ్చే ఏర్పాట్లుంటాయి. వివిధ రకాల పుస్తకాలు తదితరమైనవి ఉంటాయి. పూర్తిగా పిల్లల కోసమే వారిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతారు. ♦ మరో పార్కు మహిళలకే ప్రత్యేకం. ఇందులో మహిళల స్వీయ రక్షణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మహిళలకు సంబంధించిన వస్తువుల దుకాణాలు, బ్యూటీపార్లర్, కిట్టీ పార్టీలకు క్లబ్ ఏరియా.. ఇలా అన్నీ మహిళలకు సంబంధించిన అంశాలు, సదుపాయాలుండే లేడీస్ పార్క్. ♦ సీనియర్ సిటిజెన్లకు అవసరమైన శారీరక వ్యాయామాలు, ఇబ్బందుల్లేకుండా సాఫీగా నడిచేందుకు ఎగుడుదిగుడుల్లేని నడకమార్గాలు, వృద్ధాప్యంలో ఆడుకునే ఆటలు..తదితర సదుపాయాలతో సీనియర్ సిటిజెన్స్ పార్క్. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్‌తో మరో పార్కు. ఎన్ని జలాశయాలు, ఎన్ని మోటార్లు.. ఎత్తిపోతలు ఎక్కడినుంచి మొదలై నీరు ఎక్కడకు చేరుతుంది. తదితరమైనవి కళ్లకు కట్టేలా ఇరిగేషన్ పార్కు. ♦ చెత్త అంటే వ్యర్థమే కాదు.. దాంతో ఎన్నో అర్థాలున్నాయి. దాన్నెలా వినియోగించుకుంటే ఏయే ప్రయోజనాలుంటాయి తదితరమైనవి అర్థమయ్యేలా స్వచ్ఛ అంశాలకు సంబంధించి 12 రకాల పార్కులు. ♦ ఇలా వివిధ రకరకాల థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. దాదాపు 25 థీమ్‌లతో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎకరానికి పైగా విస్తీర్ణమున్న ఖాలీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి 47ప్రదేశాలను గుర్తించారు. వీటిల్లో ఈ థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అర్బన్ లివింగ్ థీమ్ పార్కులుగా వ్యవహరించే వీటి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. స్వచ్ఛత పార్కుల్లో.. స్వచ్ఛత (స్వచ్ఛ హైదరాబాద్) థీమ్‌తో ఏర్పాటయ్యే పార్కుల్లో ఒక దాంట్లో వ్యర్థాల రీసైక్లింగ్‌తో చేసిన ఉత్పత్తులుంటాయి. మరోదాంట్లో పాత టైర్లతో అందంగా రూపొందించిన కుర్చీలు తదితరమైనవి ఉంటాయి. ఇంకో పార్కులో అచ్చంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌చేసి తయారు చేసిన బెంచీలు, డస్ట్బిన్లు, ఫెన్సింగ్ తదితరమైనవి ఉంటాయి. ఒక పార్కులో వ్యర్థాలను ఎన్ని రకాలుగా( పేపర్, గ్లాస్, ప్లాస్టిక్, ఆర్గానిక్, మెటల్‌గా) వర్గీకరించవచ్చో తెలుస్తుంది. మరో దాంట్లో వ్యర్థాలతోనే ప్రముఖ కట్టడాలను నిర్మిస్తారు. దీన్ని వేస్ట్ టు వండర్ పార్క్ అంటారు. ఇందులో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, వరంగల్ ఫోర్ట్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటివి ఉంటాయి. మరోదాంట్లో చెత్తనుంచి విద్యుత్ ఎలా వస్తుందో తెలిసేలా ఉంటుంది. పొడిచెత్తలో ఎన్ని రకాలుంటాయో ఇంకోపార్కు వివరిస్తుంది. అంతేకాకుండా చెత్తను ఎలా వేరుచేయాలో , ఎలా రీయూజ్ చేయవచ్చో కూడా పిల్లలకు తెలియజేసే వారుంటారు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ కాన్సెప్ట్‌తో‘ 3ఆర్ కాన్సెప్ట్’ పేరిట మరో పార్కు. వ్యర్థాలను ఎలా రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ చేయవచ్చో పిల్లలకు అర్థమయ్యేలా ప్రదర్శనలుంటాయి. ఇలా స్వచ్ఛ అంశాలకు సంబంధించే 12 థీమ్‌లతో పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రజలకు సందేశమిచ్చేలా ఉంటాయి.