ఇది ఒక అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్. దీని పేరు చిల్డ్రన్స్ రిపబ్లిక్. ఈ పార్కు లోపలి వాతావరణం పూర్తిగా పేరుకు తగినట్లుగానే ఉంటుంది. అర్జెంటీనాలోని మాన్యువల్ బి గానెట్ నగరంలో ఉందిది. దేశంలోని పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అర్జెంటీనా ప్రభుత్వం 1951 నవంబర్ 26న ఈ పార్కును ప్రారంభించింది. ఈ పార్కు నిర్మించిన 130 ఎకరాల స్థలంలో అంతకు ముందు గోల్ఫ్‌కోర్స్ ఉండేది.
ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని, ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందులో నగరాలు, పట్టణాలు, పల్లెల నమూనాలు, తాజ్‌మహల్ స్ఫూర్తితో నిర్మించిన ‘ప్యాలెస్ ఆఫ్ కల్చర్’, పిల్లల బ్యాంకు, ఆక్వేరియం, పిల్లల పార్లమెంటు వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్కులోని పిల్లల బృందాలు పిల్లల పార్లమెంటు కోసం తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారు. అందరూ కలసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పనులు చేస్తారు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment