republic
-
పిల్లల గణతంత్ర ప్రపంచం!
ఇది ఒక అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. దీని పేరు చిల్డ్రన్స్ రిపబ్లిక్. ఈ పార్కు లోపలి వాతావరణం పూర్తిగా పేరుకు తగినట్లుగానే ఉంటుంది. అర్జెంటీనాలోని మాన్యువల్ బి గానెట్ నగరంలో ఉందిది. దేశంలోని పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అర్జెంటీనా ప్రభుత్వం 1951 నవంబర్ 26న ఈ పార్కును ప్రారంభించింది. ఈ పార్కు నిర్మించిన 130 ఎకరాల స్థలంలో అంతకు ముందు గోల్ఫ్‌కోర్స్ ఉండేది. ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని, ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందులో నగరాలు, పట్టణాలు, పల్లెల నమూనాలు, తాజ్‌మహల్ స్ఫూర్తితో నిర్మించిన ‘ప్యాలెస్ ఆఫ్ కల్చర్’, పిల్లల బ్యాంకు, ఆక్వేరియం, పిల్లల పార్లమెంటు వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్కులోని పిల్లల బృందాలు పిల్లల పార్లమెంటు కోసం తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారు. అందరూ కలసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!) -
మూత పడనున్న మరో బ్యాంక్? షేర్లు భారీగా పతనం...
అమెరికా సిలికాన్ బ్యాంక్ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్‌తోపాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా అన్ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది. -
రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్
శాన్‌జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది. మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. -
హాస్పిటల్ నుంచి ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej Tweets From Hospital: రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. తాజాగా ఆయన హాస్పిటల్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. నాపై, రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ‘థంబ్స్ అప్’సింబల్ చూపిస్తూ ఓ ఫోటోను ఆయన షేర్ చేశారు. దీంతో రూమర్లకు చెక్ పెట్టినట్లయ్యింది. చదవండి: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ గతనెల 10వ తేదీన సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సాయితేజ్ ట్వీట్ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపింది. కాగా సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. చదవండి: మా ఎన్నికలు: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “ See you soon pic.twitter.com/0PvIyovZn3 — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021 -
‘రిపబ్లిక్’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ పాప్ సింగర్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటికి ఆస్పత్రి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాయి పూర్తిగా కోలుకోకనప్పటికీ ముందుగా అనుకున్న తేదీ అక్టోబర్ 1న ‘రిపబ్లిక్’ మూవీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రేపు(శుక్రవారం) ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో నేడు స్పెషల్ షో చూసిన పలువురు సినీ హీరోలు రిపబ్లిక్‌పై తమ రివ్వూను ప్రకటిస్తున్నారు. ఇక ఈ మూవీ చూసిన నాని ‘డైరెక్టర్ దేవాకట్టా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు’ అంటూ తన స్పందనను తెలిపాడు. చదవండి: ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం అలాగే టాలీవుడ్ పాప్ సింగర్ స్మిత సైతం రిపబ్లిక్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘రిపబ్లిక్ సినిమా రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ అనుభవించాల్సిన ప్రయాణం. సాయిధరమ్ తేజ్ కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది. రిపబ్లిక్ దేవాకట్టా కొత్త ప్రస్థానం. నిన్న రాత్రి సినిమా చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. మీ స్పందన వినాలని ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. జీ స్టూడియోస్, జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చదవండి: ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై రీట్వీట్ చేసిన బండ్ల గణేష్, నెటిజన్లు ఫిదా Republic is @devakatta s new Prasthanam. I’m just mind blown at what I saw last night🙏🏼 @IamSaiDharamTej best ever. #Republic is beyond politics & a journey everyone needs to experience. I’m hungover & waiting to hear frm you all. @aishu_dil 🙇♀️ @meramyakrishnan 🙏🏼@IamJagguBhai 🙏🏼 pic.twitter.com/JQdI3pYVo3 — Smita (@smitapop) September 30, 2021 -
OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్య కాలంలో థియేటర్లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి బడా మూవీలు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం! కలెక్టర్‌గా సాయితేజ్ ‘రిపబ్లిక్’ మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. బైక్ రైడర్స్ ఇదే మా కథ శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’.గురు పవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు ఎలా పరిచయమవుతారు? అనుకున్న గమ్యానికి వీరు చేరుకున్నారా అన్నదే సినిమా కథ. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆహాలో ‘ఒరేయ్ బామ్మర్ది’ సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ఇది వరకే రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. అక్టోబర్1 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ► డయానా (అక్టోబర్1) ► నో వన్ గెట్స్ అవుట్ ఎలైవ్ ( సెప్టెంబరు 29) ► ద గల్టీ( అక్టోబరు 1) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► షిద్ధత్ -అక్టోబరు 1 ► లిఫ్ట్- అక్టోబరు 1 అమెజాన్ ప్రైమ్ ► చెహ్రే (సెప్టెంబరు 30) ►బింగ్ హెల్(అక్టోబరు 1) ►బ్లాక్ ఆజ్ నైట్(అక్టోబరు 1) జీ5 ► బ్రేక్ పాయింట్ (అక్టోబరు 1) -
డబ్బింగ్‌కే పదిహేను రోజులు పట్టింది
‘‘రిపబ్లిక్’ పక్కా కమర్షియల్ మూవీ కాదు.. డిఫరెంట్ మూవీ.. రియల్ స్టోరీ ఆధారంగా దేవ కట్టాగారు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు 22 రోజులు పని చేశాం. అయితే డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది. అంటే.. డైరెక్టర్‌గారు ఎంత పర్ఫెక్షన్ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్ చెప్పిన విశేషాలు. ► కరోనా సమయంలో ఓ రోజు దేవ కట్టాగారు ఫోన్ చేసి, ‘రిపబ్లిక్’ స్క్రిప్ట్ గంట పాటు చెప్పారు. హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిశాక ఐదారు గంటల పాటు కథ చెప్పారు. హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారాయన. ఈ చిత్రంలో మైరా అనే ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్ ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉండదు. ► సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా. సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. తన కెరీర్లో ‘రిపబ్లిక్’ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ► ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. పెర్ఫార్మెన్స్ అయినా, గ్లామర్ రోల్స్ అయినా చక్కగా చేస్తారు. అనుష్కగారంటే ఇష్టం. సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. -
దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్
Vaishnav Tej Emotional Speech At Republic Pre Release Event:మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అన్నయ్య కోలుకోవాడనికి కారణం డాక్టర్లు అయితే, మీ అందరి ప్రేమాభిమానాలతోనే త్వరగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ స్పాట్లో వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వాళ్లంత ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ బైక్‌పై హెల్మెట్ వేసుకొని వెళ్లండి. ఒక తమ్ముడిగా, అన్నయ్యలా,కొడుకులా చెబుతున్నా. ప్లీజ్ మీ అందరిలా ఎవరికి ఏమైనా అయినా మేమందరం బాధపడతాం' అంటూ వైష్ణవ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రిపబ్లిక్ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. -
సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి
-
Sai Dharam Tej: 'రిపబ్లిక్' ట్రైలర్ వచ్చేసింది
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ట్రైలర్‌ని బుధవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశాడు. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. ‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్’ అంటూ సాయి తేజ్ చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కాగా, ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డ సాయితేజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల సందర్భంగా సాయితేజ్ సాయితేజ్ ఆరోగ్య స్థితిపై స్పందించారు చిరంజీవి. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కలెక్టర్‌గా రానున్న సాయితేజ్.. ‘రిపబ్లిక్’ విడుదల ఎప్పుడంటే?
సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ‘‘ఆల్రెడీ విడులైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సాయితేజ్ యాక్టింగ్, దేవ కట్టా స్టైల్ ఆఫ్ మేకింగ్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో హాస్పిటల్స్ మరికొన్ని రోజులు హాస్పిటల్లోనే... ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డ సాయితేజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ ఆరోగ్య స్థితిపై శనివారం సాయంత్రం తాజా హెల్త్ బులిటెన్ విడుదలైంది. ‘‘సాయితేజ్ స్పృహలోనే ఉన్నారు. వెంటిలేటర్ తొలగించడంతో సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారు. చికిత్స నిమిత్తం మరికొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటారు’’ అని ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి. -
రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్
ప్రముఖ నటి రమ్యకృష్ణ బర్త్‌డే 51 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బుధవారం(సెప్టెంబర్ 15) ఆమె బర్త్‌డే సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు రిప్లబిక్ మూవీ టీం. సాయి ధరమ్ తేజ్‌హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పాత్ర లుక్, పేరును ప్రకటించారు. ఇందులోని ఆమె విశాఖ వాణి అనే సీరియస్‌గా పవర్ ఫుల్ మహిళ రాజకియ నాయకురాలిగా కనిపించారు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. Wishing #VishakhaVani a.k.a @meramyakrishnan A very Happy & Joyous Birthday #REPUBLIC #RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @IamJagguBhai #ManiSharma @mynnasukumar @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/xgZJrMO4Q5 — BA Raju's Team (@baraju_SuperHit) September 15, 2021 -
‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’
Director Deva Katta About His Movies: ‘ప్రస్థానం’(2010) మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ దేవా కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాలను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం పొలిటికల్ జానర్లో రిపబ్లిక్ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ పోషించగా నటి రమ్యకృష్ణ పవర్ఫుల్ మహిళ పాత్రలో అలరించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ ఈ నేపథ్యంలో రిపబ్లిక్ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ దేవాకట్టా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ మూవీ గురించి ముచ్చటించాడు. అంతేగాక ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా ప్రస్తావించాడు. ఈ మేరకు ప్రస్తుతం తన దగ్గర పలు ఆసక్తికర స్క్రిప్ట్స్ ఉన్నట్లు చెప్పాడు. ‘నా దగ్గర ప్రస్తుతం 6 నుంచి 7 కథలు ఉన్నాయి. అందులో రెండు కథలు చాలా బలమైనవి, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నీ కొత్త పాయింట్స్‌తోనే కథలు రాశాను. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ వాటిని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఒక్కొసారి ఆ సినిమాలు తీయకుండానే చనిపోతానేమోనని భయం కూడా వేస్తుంటుంది. అందుకే రిపబ్లిక్ విడుదలైన తర్వాత మూడు నెలల్లోపు నా సినిమాలను మొదలుపెడతా. ఆ రెండు కథలను జనాలకు అందించకపోతే నా జీవితానికి అర్థమే లేదు. అన్నీ కొత్త పాయింట్స్ తోనే కథలు రాశాను. ఓటీటీలో పోరాటం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. వచ్చే అయిదేళ్ల వరకు నాన్ స్టాప్‌గా సినిమాలు తీసి ఈ కథలు పూర్తయిన తర్వాత ఓటీటీ కోసం పనిచేయడంపై ఆలోచిస్తా’అంటూ చెప్పుకొచ్చాడు. -
‘జోర్ సే’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్టా తెరకెక్కించిన ఈ మూవీలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. సుద్దాల అశోక్ తేజా రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాంపై నిర్మిస్తున్నారు. ఈ పాట విషయానికి వస్తే.. జానపద బాణీలో ఊపుతో హుషారుగా జోరు సే అంటూ సాగిన ఈ పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో తేజ్ మాస్ స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తోందిజ ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. -
తేజ్‌కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే!
‘‘సాయితేజ్‌ని చూస్తే నాకేదో చిన్న ఎమోషనల్ కనెక్ట్. తేజ్‌కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే ఆనందపడతాను’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఈ సినిమాలోని ‘ఎయ్ రారో.. ఎయ్ రారో.. ఎయ్‌రో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం..’ లిరికల్ వీడియోను శనివారం హైదరాబాద్‌లో కొరటాల శివ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాటలో స్వేచ్ఛ గురించి బాగా చెప్పారు. కంటెంట్‌ను దేవ కట్టా చాలా ఇంటెన్స్‌గా చెబుతారని ‘ప్రస్థానం’ చూసినప్పుడే అనుకున్నాను. ‘రిపబ్లిక్’లో కూడా అందరూ ఆలోచించే విషయాన్ని గట్టిగా, ఇంటెన్స్‌తో చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను. మణిశర్మగారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకు అన్నారో తెలిసింది. భగవాన్, పుల్లారావు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘పెద్ద స్క్రీన్‌లో సాంగ్ చూసి చాలా రోజులయింది. నా పాట అనే కాదు... ఏ సినిమా పాటనైనా పెద్ద స్క్రీన్‌లో చూస్తే ఉండే కిక్కే వేరు. ఒక ఆర్టిస్ట్ నటనను వెండితెరపై చూస్తే ఆ సంతోషమే వేరు. ‘రిపబ్లిక్’ను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం. నా చిన్నప్పుడే మణిశర్మగారి పాటలు విన్నాను. అప్పట్నుంచే నా మైండ్‌లో ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానేమో. అది ఇప్పుడు కుదిరింది. మంచి స్క్రిప్ట్, మంచి రోల్ ఇచ్చిన దేవాగారికి, రాజీ పడకుండా తీసిన భగవాన్, పుల్లారావు, జీ స్టూడియోస్‌కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మణిశర్మగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మంచి లిరిక్స్ ఇచ్చిన రెహమాన్‌కు థ్యాంక్స్’’ అన్నారు దేవ కట్టా. మణిశర్మ మాట్లాడుతూ – ‘‘తేజ్‌తో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. భగవాన్‌తో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. దేవాతో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. ‘రిపబ్లిక్’తో కుదిరినందుకు సంతోషం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తొలి పాట కొరటాల శివగారి చేతుల మీదగా లాంచ్ కావడమే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం’’ అన్నారు భగవాన్. కో ప్రొడ్యూసర్ జయ ప్రకాష్, ‘జీ’ సంస్థ ప్రతినిధి ప్రసాద్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్, రచయిత–దర్శకుడు రవి పాల్గొన్నారు అలాగే నేడు (జూలై 11) మణిశర్మ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో చిత్రబృందం సెలబ్రేట్ చేసింది. -
రంగంలోకి సాయి ధరమ్‌తేజ్.. రిపబ్లిక్ డబ్బింగ్ షురూ..
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం రిపబ్లిక్. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్4నే విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక గతేడాది సైతం కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం థియేటర్స్ తెరుచుకున్నాక మొదట రిలీజైన తెలుగు సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటికి 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లు కానుండటంతో తన సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. చదవండి : సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టుకు నో చెప్పిన కృతిశెట్టి? -
Republic: ఓటీటీలో సాయిధరమ్ తేజ్ సినిమా?
కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతపడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చాలా సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా చిత్రాలు మాత్రం ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా ఓటీటీ బాట పట్టాయి. పైగా థియేటర్లో అంతంతమాత్రంగా ఆడిన సినిమాలు కూడా ఓటీటీలో హిట్టు కొడుతుండటంతో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న సినిమాల లిస్టులో సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమా కూడా ఉన్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తోంది. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 4న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్‌ను అందిస్తుండటంతో వాటితో డీల్ కుదుర్చుకునే దిశగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి రిపబ్లిక్ నిజంగానే ఓటీటీలోకి వస్తుందా? లేదా? అనేది క్లారిటీ రావాల్సిందే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టుకు నో చెప్పిన కృతిశెట్టి? -
రిపబ్లిక్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
స్పెషల్ లుక్‌లో రమ్యకృష్ణ.. ఆసక్తి రేపుతున్న రిపబ్లిక్ టీజర్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిప్లబిక్’. సుదీర్ఘకాలం తర్వాత డైరెక్టర్ దేవా కట్ట తీస్తున్న చిత్రం ఇది. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రీల్లర్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవా ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’ తీశారు. ఈ మూవీ టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ దేవా కట్ట పొలిటికల్ జానర్ ‘రిపబ్లిక్’తో తిరిగి వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టిజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్వవస్థలే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నామంటూ’ సమాధుల్లో కలిసిపోతున్న వ్యవస్థను ప్రశ్నిస్తూ దారిలో పెట్టాలనుకునే యువకుడి కథే రిపబ్లిక్ థీమ్. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలితను తలపించేలా రమ్యకృష్ణ లుక్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. దీంతో ఈ మూవీలో రమ్యకృష్ణ సీఎం పాత్రలో కనిపించనున్నారని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే రమ్యకృష్ణ లుక్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభుత్వ అధికారులు నేతలకు బానిసలుగా మారితే సమాజంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేదే మెయిన్ పాయింట్‌గా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఇందులో తేజ్ కీలక పదవిలో ఉండే ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్లు క్లారిటి వచ్చేసింది. చదవండి: ‘వైల్డ్‌డాగ్ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’ రామ్‌చరణ్ బర్త్‌డే సీడీపీ: ఫ్యాన్స్ ట్రోలింగ్! -
అధికారం మాత్రమే శాశ్వతం అంటున్న రమ్యకృష్ణ
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇందులో శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్ర చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని రాసిన వాక్యాలతో ఆమె లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రను సాయితేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనున్నారు’’ అన్నారు. -
రిపబ్లిక్కి ముహూర్తం
సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమాని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా జె. భగవాన్, జె. పుల్లారావు మాట్లాడుతూ – ‘‘సాయితేజ్ ఇప్పటివరకు చేసిన చిత్రాలకు భిన్నంగా మా ‘రిపబ్లిక్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ. -
అదే అసలైన ‘రిపబ్లిక్’ అంటున్న మెగా మేనల్లుడు
దేవకట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ సోమవారం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధానాకర్షణగా నిలిచింది. ‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ కోర్టు రూమ్‌లో సాయి ధరమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. చదవండి: ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది దీనికి తోడు గుర్రాలను చూపిస్తూ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత దేవా కట్టా నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఈ సినిమా పూర్తిగా రాజకీయాలు, ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో కాగా గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈ యువ హీరో.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రిపబ్లిక్ అంటూ మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు. -
భారత విద్యార్థులతో గౌరవంగా వ్యవహరించండి
వాషింగ్టన్: అమెరికాలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వ్యవహారంలో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందించాలని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు అధికారుల్ని కోరారు. వీరిపట్ల గౌరవంగా, మానవీయతతో వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, థామస్ సౌజ్జి, రాబ్ వూడల్, బ్రెండా లారెన్స్ తదితరులు హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)తో పాటు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు లేఖ రాశారు. అమెరికాలో అక్రమ మార్గాల్లో స్థిరపడేందుకు విదేశీయులకు సాయంచేస్తున్న వారిని పట్టుకోవడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు 2017లో ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీని గ్రేటర్ డెట్రాయిట్ ప్రాంతంలో స్థాపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 129 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ.. అరెస్టయిన భారతీయులకు చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పించాలనీ.. తమ న్యాయవాదిని కలుసుకునేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. -
ఏపీలో జగన్ ప్రభంజనం
-
ఏపీలో జగన్ ప్రభంజనం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్–సీ వోటర్ సర్వే తేల్చింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 8, టీఆర్ఎస్ 7, బీజేపీ 1, మజ్లిస్ 1 సీటు చొప్పున గెలుస్తాయని పేర్కొంది. డిసెంబర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రదర్శన మెరుగవుతుందని, ఆ కూటమి వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలిపింది. వరదల్లో మునిగిన కేరళకు తక్కువ సాయం చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అక్కడ ఖాతా తెరవడం కష్టమేనని, పార్లమెంట్ రెండు సభల్లో మెజారిటీ సాధించేందుకు వ్యూహాత్మకంగా కీలకమైన యూపీలో బీజేపీకి, అఖిలేశ్, మాయావతిల కూటమితో ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించింది. సర్వే విశేషాలు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్రమంగా ప్రభ కోల్పోతోంది. ఆ పార్టీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుంది. 2014లో రెండు స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈసారి రిక్తహస్తమే. ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ 7 సీట్లు (30.40% ఓట్లు) , కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 8 సీట్లు(32.2%), బీజేపీ 1 సీటు(19%), ఏఐఎంఐఎం 1 స్థానం( 3.9%) గెలుచుకుంటాయి. ఇతరులకు 163 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 261 సీట్లు సాధించి సాధారణ మెజారిటీ(272 సీట్లు)కి కొద్ది దూరంలో నిలుస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే సాధించిన సీట్ల(282) కన్నా ఇది 21 స్థానాలు తక్కువ కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూడా తన సీట్లను గణనీయంగా పెంచుకుని 119 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అనూహ్యంగా 163 సీట్లు గెలుచుకునే ఇతరులే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. కేంద్రంలో అధికారం దక్కాలంటే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్–మాయావతిల కూటిమిదే హవా. ఆ 2 పార్టీలు కలసి 44 సీట్లు గెలుచుకుంటాయి. గతంలో 71 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి 31 సీట్లకు మాత్రమే పరిమితంకానుంది. ఢిల్లీలోని అన్ని స్థానాల్ని బీజేపీయే గెలుచుకుంటుంది. రాజస్తాన్ కోట కాంగ్రెస్‌దే! జైపూర్: ఐదేళ్ల విరామం తర్వాత రాజస్తాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. 2013 ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసిన బీజేపీకి ఈసారి అపజయమే ఎదురవుతుందంది. రాజస్తాన్ శాసనసభలో మొత్తం 200 స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 163 చోట్ల విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాల్లో గెలిచి ఘోర అపజయం పాలైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ 110–120 మధ్య సీట్లు గెలవనుందనీ, బీజేపీకి 70 నుంచి 80 సీట్లే వస్తాయని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ సర్వే అంటోంది. అటు రాజస్తాన్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇప్పటికే తేల్చి చెప్పిన మాయావతి పార్టీ బీఎస్పీకి గరిష్టంగా మూడు సీట్లు మాత్రమే రావొచ్చని తెలిపింది. మొత్తం 67 నియోజకవర్గాల్లో 8,040 మంది అభిప్రాయాలను సర్వే కోసం సేకరించారు.