![Vaishnav Tej Emotional Speech At Republic Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/25/v.gif.webp?itok=rEborTob)
Vaishnav Tej Emotional Speech At Republic Pre Release Event:మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అన్నయ్య కోలుకోవాడనికి కారణం డాక్టర్లు అయితే, మీ అందరి ప్రేమాభిమానాలతోనే త్వరగా కోలుకుంటున్నాడు.
యాక్సిడెంట్ స్పాట్‌లో వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వాళ్లంత ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ బైక్‌పై హెల్మెట్ వేసుకొని వెళ్లండి. ఒక తమ్ముడిగా, అన్నయ్యలా,కొడుకులా చెబుతున్నా. ప్లీజ్ మీ అందరిలా ఎవరికి ఏమైనా అయినా మేమందరం బాధపడతాం' అంటూ వైష్ణవ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రిపబ్లిక్ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment