స్పెషల్‌ లుక్‌లో రమ్యకృష్ణ.. ఆసక్తి రేపుతున్న రిపబ్లిక్‌ టీజర్‌ | Sai Dharam Tej Republic Movie Teaser Release | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్: స్పెషల్‌ లుక్‌లో రమ్యకృష్ణ, సాయి ధరమ్‌ తేజ్‌

Apr 5 2021 1:40 PM | Updated on Apr 5 2021 3:57 PM

Sai Dharam Tej Republic Movie Teaser Release - Sakshi

ప్రజాస్వాయ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్వవస్థలే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం..

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రిప్లబిక్‌’. సుదీర్ఘకాలం తర్వాత డైరెక్టర్‌ దేవా కట్ట తీస్తున్న చిత్రం ఇది. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్‌ థ్రీల్లర్‌ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవా ఆ తర్వాత ‘ఆటోనగర్‌ సూర్య’ తీశారు. ఈ మూవీ టేకింగ్‌ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ​ఇక కొంతకాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ దేవా కట్ట పొలిటికల్‌ జానర్‌ ‘రిపబ్లిక్‌’తో తిరిగి వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టిజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్వవస్థలే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బ్రతుకుతున్నామంటూ’ సమాధుల్లో కలిసిపోతున్న వ్యవస్థను ప్రశ్నిస్తూ దారిలో పెట్టాలనుకునే యువకుడి కథే రిపబ్లిక్‌ థీమ్‌. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలితను తలపించేలా రమ్యకృష్ణ లుక్‌ టీజర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. 

దీంతో ఈ మూవీలో రమ్యకృష్ణ సీఎం పాత్రలో కనిపించనున్నారని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్‌ అయితే రమ్యకృష్ణ లుక్‌ ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇక ప్రభుత్వ అధికారులు నేతలకు బానిసలుగా మారితే సమాజంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేదే మెయిన్‌ పాయింట్‌గా చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఇందులో తేజ్‌ కీలక పదవిలో ఉండే ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్లు క్లారిటి వచ్చేసింది.    

చదవండి: 
‘వైల్డ్‌డాగ్‌ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’
రామ్‌చరణ్‌ బర్త్‌డే సీడీపీ: ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement