
Director Deva Katta About His Movies: ‘ప్రస్థానం’(2010) మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ దేవా కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాలను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్‌లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం పొలిటికల్ జానర్‌లో రిపబ్లిక్ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ పోషించగా నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్ మహిళ పాత్రలో అలరించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ
ఈ నేపథ్యంలో రిపబ్లిక్ ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్ దేవాకట్టా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ మూవీ గురించి ముచ్చటించాడు. అంతేగాక ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా ప్రస్తావించాడు. ఈ మేరకు ప్రస్తుతం తన దగ్గర పలు ఆసక్తికర స్క్రిప్ట్స్ ఉన్నట్లు చెప్పాడు. ‘నా దగ్గర ప్రస్తుతం 6 నుంచి 7 కథలు ఉన్నాయి. అందులో రెండు కథలు చాలా బలమైనవి, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నీ కొత్త పాయింట్స్‌తోనే కథలు రాశాను.
చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్
వాటిని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఒక్కొసారి ఆ సినిమాలు తీయకుండానే చనిపోతానేమోనని భయం కూడా వేస్తుంటుంది. అందుకే రిపబ్లిక్ విడుదలైన తర్వాత మూడు నెలల్లోపు నా సినిమాలను మొదలుపెడతా. ఆ రెండు కథలను జనాలకు అందించకపోతే నా జీవితానికి అర్థమే లేదు. అన్నీ కొత్త పాయింట్స్ తోనే కథలు రాశాను. ఓటీటీలో పోరాటం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. వచ్చే అయిదేళ్ల వరకు నాన్ స్టాప్‌గా సినిమాలు తీసి ఈ కథలు పూర్తయిన తర్వాత ఓటీటీ కోసం పనిచేయడంపై ఆలోచిస్తా’అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment