‘జోర్‌ సే’ అంటూ మాస్‌ స్టెప్పులతో అదరగొట్టిన మెగా మేనల్లుడు | Sai Dharam Tej Republic Movie Lyrical Song Release | Sakshi
Sakshi News home page

‘రిపబ్లిక్‌’ నుంచి లిరికల్‌ సాంగ్‌, మాస్‌ స్టెప్పులతో అదరగొట్టిన తేజ్‌

Published Mon, Sep 6 2021 7:43 PM | Last Updated on Mon, Sep 6 2021 7:43 PM

Sai Dharam Tej Republic Movie Lyrical Song Release - Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్టా తెరకెక్కించిన ఈ మూవీలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. సుద్దాల అశోక్ తేజా రాసిన ఈ పాటకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాంపై నిర్మిస్తున్నారు. 

ఈ పాట విషయానికి వస్తే.. జానపద బాణీలో ఊపుతో హుషారుగా జోరు సే అంటూ  సాగిన ఈ పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో తేజ్‌ మాస్‌ స్టెప్పులకు మెగా ఫ్యాన్స్‌ చేత ఈలలు వేయిస్తోందిజ ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ అక్టోబ‌ర్ 1న విడుద‌ల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement