![Sai Dharam Tej Started Dubbing For Republic Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/22/sai.gif.webp?itok=D9YaTMum)
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం రిపబ్లిక్. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్4నే విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.
ఇక గతేడాది సైతం కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం థియేటర్స్ తెరుచుకున్నాక మొదట రిలీజైన తెలుగు సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటికి 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లు కానుండటంతో తన సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది.
చదవండి : సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టుకు నో చెప్పిన కృతిశెట్టి?
Comments
Please login to add a commentAdd a comment