Pop Singer Smitha Tweets About Republic Movie- Sakshi
Sakshi News home page

Pop Singer Smitha: రిపబ్లిక్‌ సాయి తేజ్‌ కెరీర్‌కు ప్లస్‌ అవుతుంది: సింగర్‌ స్మిత

Published Thu, Sep 30 2021 9:19 PM | Last Updated on Fri, Oct 1 2021 12:24 PM

Tollywood Pop Singer Smitha Gave Review On Republic Movie On Twitter - Sakshi

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికి ఆస్పత్రి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాయి పూర్తిగా కోలుకోకనప్పటికీ ముందుగా అనుకున్న తేదీ అక్టోబర్‌ 1న ‘రిపబ్లిక్‌’ మూవీని విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. రేపు(శుక్రవారం) ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో నేడు స్పెషల్‌ షో చూసిన పలువురు సినీ హీరోలు రిపబ్లిక్‌పై తమ రివ్వూను ప్రకటిస్తున్నారు. ఇక ఈ మూవీ చూసిన నాని ‘డైరెక్టర్‌ దేవాక‌ట్టా మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు’ అంటూ తన స్పందనను తెలిపాడు.

చదవండి: ఉత్తేజ్‌ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం

అలాగే టాలీవుడ్ పాప్ సింగ‌ర్ స్మిత సైతం రిప‌బ్లిక్ సినిమాపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ‘రిప‌బ్లిక్ సినిమా రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ అనుభవించాల్సిన ప్రయాణం. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. రిప‌బ్లిక్‌ దేవాక‌ట్టా కొత్త ప్ర‌స్థానం. నిన్న రాత్రి సినిమా చూసిన త‌ర్వాత మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. మీ స్పంద‌న‌ వినాల‌ని ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. జీ స్టూడియోస్, జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో జగపతి బాబు, రమ్య కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. 

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై రీట్వీట్‌ చేసిన బండ్ల గణేష్‌, నెటిజన్లు ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement