Republic Movie Trailer Launched By Chiranjeevi - Sakshi
Sakshi News home page

Republic :కలెక్టర్‌గా అదరగొట్టిన సాయి తేజ్‌.. ఆరోగ్యంపై చిరు ఏమన్నారంటే..

Published Wed, Sep 22 2021 12:05 PM | Last Updated on Wed, Sep 22 2021 6:12 PM

Republic Movie Trailer Launched By Chiranjeevi - Sakshi

మెగా మేనల్లుడు సాయి తేజ్‌  హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ట్రైలర్‌ని బుధవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశాడు. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో నటించారు సాయితేజ్‌.

‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌’ అంటూ సాయి తేజ్‌ చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. 

కాగా, ఇటీవల బైక్‌ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సాయితేజ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ విడుదల సందర్భంగా సాయితేజ్‌ సాయితేజ్‌ ఆరోగ్య స్థితిపై స్పందించారు చిరంజీవి. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement