Actor Sai Dhram Tej Emotional Words On Chiranjeevi Tweet - Sakshi
Sakshi News home page

Sai Tej: ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.. సాయితేజ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Published Sat, Nov 6 2021 2:17 PM | Last Updated on Sat, Nov 6 2021 3:36 PM

Sai Tej Emotional Comments On Chiranjeevi Tweet - Sakshi

Sai Dharam Tej: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు సాయి తేజ్‌.. పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యాడు. తాజాగా ఆయన తన మామయ్యలైన చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లతో కలిసి దీపావళి పండగను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ వేడుకకు మేగా హీరోలందరు వచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి తెలియజేస్తూ.. ‘అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి  సాయి ధరమ్ తేజ్  పూర్తి గా కోలుకున్నాడు.
(చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్‌)

మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ’ ట్వీట్‌ చేశాడు. తాజాగా చిరంజీవి ట్వీట్‌ చేసిన పోస్ట్‌ని సాయితేజ్‌ రీట్వీట్‌ చేస్తూ.. నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం' అని పేర్కొన్నారు, ప్రస్తుతం సాయితేజ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement