
తన మావయ్యలకు ఎప్పుటికి రుణపడి ఉంటానంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SDT 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి విరపాక్ష అనే టైటిల్ ఖారారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన ముగ్గురు మామయ్యలకు(మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాంబు) థ్యాక్స్ చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఈ ఇక్కడ ఉండటానికి మా మావయ్యలే కారణం. నాకు ఒర్పు, సహనం, సమన్వయనం నేర్పించిన మా మావయ్యలకు నా జీవితాంతం రుణపడి ఉంటాను.
వాళ్లు నేర్పించిన ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం తన తల్లికి సారీ చెప్పాడు. ఆస్పత్రి బెడ్ ఉన్నప్పుడు ఈమాట చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుతున్నానంటూ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా తన కోసమే చేశానని, తన కోసమే ఇంత కష్టపడుతున్నాన్నాడు. ఇక ఈ గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ను అందించిన తారక్‌ను గురించి మాట్లాడుతూ.. ‘మై డియర్ తారక్. మొదటి నుంచి కూడా నాపై ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తూ వచ్చావు. అదే ప్రేమను ఇప్పటికీ పంచుతున్నావు. ఎవరు ఏమనుకున్నా నీ స్నేహం నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
చదవండి:
ఆసక్తిగా సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష టైటిల్ గ్లింప్స్, ఎన్టీఆర్ వాయిస్ అదుర్స్
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment