అధికారం మాత్రమే శాశ్వతం అంటున్న రమ్యకృష్ణ | Ramya Krishna Plays Vishakha vani In Sai Tej Republic | Sakshi
Sakshi News home page

అధికారం మాత్రమే శాశ్వతం

Published Sun, Apr 4 2021 12:33 PM | Last Updated on Sun, Apr 4 2021 12:33 PM

Ramya Krishna Plays Vishakha vani In Sai Tej Republic - Sakshi

సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 4న విడుదల కానుంది. ఇందులో శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్ర చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేశారు.

‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని రాసిన వాక్యాలతో ఆమె లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రను సాయితేజ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని పవర్‌ఫుల్‌ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనున్నారు’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement