అధ్యక్ష అభ్యర్థిత్వానికి చేరువగా ట్రంప్
కొలంబియా(యూఎస్): అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థత్వం డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపుగా ఖాయమైనట్టే. తాజాగా మిస్సోరీ, ఐదహో, మిషిగన్ ప్రైమరీల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు మద్దతు పలికిన డెలిగేట్ల సంఖ్య 244కు పెరిగింది. ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 24 డెలిగేట్ల మద్దతుతో చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కాలంటే 1,215 డెలిగేట్ల మద్దతు కావాలి.
మిషిగన్ రాష్ట్ర ప్రైమరీలో 68 శాతం ఓట్లు ట్రంప్‌కు, 27 శాతం ఓట్లు హేలీకి పడ్డాయి. మంగళవారం జరగబోయే 16 ప్రైమరీల ఫలితాలతో రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు దాదాపు తేలిపోనున్నారు. మొత్తం డెలిగేట్లలో మూడింట ఒక వంతు మంది ఆ రోజున తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది ఓటేసి నిర్ణయిస్తారు. ఇప్పటివరకు కొనసాగిన ట్రంప్ అజేయ జైత్రయాత్ర చూస్తుంటే బైడెన్‌కు పోటీగా బరిలో దిగే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేనని దాదాపు ఖరారైనట్టు కన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment