హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం | Trinamool Leader Opens Fire From Car After 'Hit-And-Run', 2 Killed | Sakshi
Sakshi News home page

హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం

Published Mon, Dec 28 2015 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం

హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం

కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు పవిత్రా రాయ్ను హిట్ అండ్ రన్ కేసులో  అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మాల్దాలో పవిత్రా రాయ్ ప్రయాణిస్తున్న కారు.. సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ టీనేజర్ (18) అక్కడిక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా పవిత్రా రాయ్ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు చుట్టుముట్టి కారును ఆపారు. పవిత్రా రాయ్ కారు దిగకుండా వీరంగం సృష్టించాడు. కారు లోపల నుంచే జనంపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కారులో పవిత్రా రాయ్తో పాటు ఐదుగురు ఉన్నారు. ఆదివారం రాత్రి పోలీసులు టీఎంసీ నేతను అరెస్ట్ చేశారు. ఆయనతో కలసి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాగా పవిత్రా రాయ్ కాల్పులు జరిపిన ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement