Trinamool Congress Leader
-
బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి
కోల్‌కతా: పశి్చమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచి్చపోయి ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాల్నీ వదల్లేదు. వాటిని ధ్వంసం చేశారు. రక్షణగా వచి్చన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు. సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వాహనాల్ని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స చేయించనున్నారు. రాష్ట్రమంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోనే గత ఏడాది మాలిక్ అరెస్టయ్యారు. షేక్ షాజహాన్‌పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఘటనతో సంబంధమున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పారు. సందేశ్‌ఖలి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనాగరిక చర్యను, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. రాజ్యాంగానికి లోబడి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర అధికారులపై దాడి సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేర్కొన్నారు. ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కోరారు. -
Derek O'Brien: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై కేంద్ర ప్రభుత్వం విమర్మలు గుప్పించారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం వల్ల పార్లమెంట్ భవనం.. లోతైన ఒక చికటి గదిలా మారిందని అన్నారు. 2001లో పార్లమెంట్ భద్రత వైఫల్యం చోటుచేసుకున్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి లోక్‌సభలో, హోం మంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. అదే విధంగా అప్పటి ప్రభుత్వం మూడు రోజుల పాటు సూదీర్ఘంగా చర్చ జరిగిపిందని లెలిపారు. కానీ.. 2023లో చోటు చేసుకున్న పార్లమెంట్ అలజడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మౌనం వీడలేదని మండిపడ్డారు. అదీకాక, ఈ ఘటనపై చర్చ జరగాలని కోరినందుకు ఏకంగా ఉభయ సభలల్లో 146 మంది ఎంపీని సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. దీంతో పార్లమెంట్ భవనం లోతైన చీకటి గదిగా మారిందని అన్నారు. 2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha 2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min Parliament turned into a deep, dark chamber — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023 డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపల, మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల రంగు గొట్టాలతో పొగ విడుదల చేసి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిక్షాలు పట్టుబట్టగా.. లోక్ సభలో 100, రాజ్య సభలో 46 మంది సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. -
చెక్కు తీసుకోండి.. ఓట్లేయండి!
ఎన్నికల్లో ఓటర్లకు అభ్యర్థులు డబ్బులివ్వడం మామూలే. ఓటర్లకు డబ్బులు పంచడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి, బయటకు పొక్కితే అభ్యర్థికి ఇబ్బందులొస్తాయి కాబట్టి మూడో కంటికి తెలియకుండా సొమ్ములిస్తుంటారు. అయితే, పశ్చిమబెంగాల్లో తృణమూల్ పార్టీకి చెందిన నాయకుడొకరు ఏకంగా ఓటర్లకు (రైతులకు) చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు వంద మందికి రూ.2 వేలు, రూ.5 వేల చెక్కులు ఇచ్చారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పంచాయతీ ప్రధాన్ (సర్పంచ్) మదసుర్ హుస్సేన్ ఇలా చెక్కులు పంచుతూ దొరికిపోయారు. అయినా ఆయనేం భయపడలేదు. చెక్కులిస్తే తప్పేమిటని ఎదురు నిలదీశారు. ‘అవును మేం చెక్కులు ఇచ్చాం. అయితే ఏంటి.. చెక్కులిచ్చాం కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఓటేయమని అడుగుతాం. చెక్కు తీసుకున్నారు కాబట్టి వారు తప్పకుండా మాకే ఓటేసి తీరుతారు. ఇందులో తప్పేముంది?’ అని ప్రశ్నించారాయన. అంతేకాకుండా ఆ చెక్కులు దీదీ (మమతా బెనర్జీ) ఇచ్చారని కూడా చెబుతున్నారు. మొత్తం 600 మంది రైతులకు చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. చెక్కులిచ్చి ఓట్లు అడగడంతో ఊరుకోకుండా.. ‘ఈ చెక్కులు దీదీ ఇచ్చిందన్న సంగతి గుర్తుంచుకోండి. చెక్కుకు బదులుగా మీరు మీ ఓటు మాకివ్వాలి. ఒకవేళ చెక్కు తీసుకుని ఓటేయకపోతే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెబుతున్నా.. మీ ఓటరు కార్డు నకళ్లు మా దగ్గరున్నాయన్న సంగతి మరిచిపోవద్దు’ అంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాల కింద రైతుకు రావలసిన రూ.2 లక్షలు రాకుండా చేస్తామని కూడా హుస్సేన్ హెచ్చరిస్తున్నారు. -
కర్రలతో దాడి చేస్తూ..
-
అది ప్రమాదమా? హత్యా?
కోల్ కత్తా ఎయిర్ ఫోర్స్ అధికారి అభిమన్యు గౌడ్ మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటన.. కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందా .. లేదంటే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆడీ కారు డ్రైవింగ్ సీట్ లో తృణముల్ కాంగ్రెస్ నేత మహ్మద్ షోహ్రబ్ కుమారుడు సంబియా ఉన్నారని సమాచారం. అంతకు ముందు షోహ్రబ్ పెద్ద కుమారుడు అంబియా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం సంబియా డ్రైవింగ్ చేస్తున్నాడని తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి షోహ్రబ్ తో పాటు.. అతడి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్కరిని కూడా అర్టెస్టు చేయక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈనెల 13న కోలకతాలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సిల్స్ చేస్తుండగా విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ను కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు ఉదయం... రిపబ్లిక్ డే పెరేడ్ రిహార్సిల్స్ జరిగే రోడ్డులోకి ఘటనకు కారణమైన కారు ప్రవేశించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ రోడ్డులోకి కారును పోలీసులు అనుమతించలేదు. తర్వాత కాసేపటికే ఆడీ కారు దగ్గరలోని మరో ప్రవేశమార్గం నుంచి రాంగ్ రూట్ లో వచ్చింది. ఘటనకు ముందు కారు సిగ్నల్ జంప్ చేసినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారు నంబర్ ప్లేట్ తొలగించి... అక్కడి నుంచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఈ కేసు విచారణపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ అంశం మీద సీపీఎం ఎంపీ మహ్మద్ సలీమ్ కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల వరకూ పోలీసులుఎలాంటి చర్య చేపట్టలేదన్నారు. వెంటనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అలా చేయకపోవడం వల్ల ఘటనకు కారణమైన వారు తప్పించుకోవడానికి తగినంత సమయం దొరికిందని విమర్శించారు. -
హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు పవిత్రా రాయ్‌ను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మాల్దాలో పవిత్రా రాయ్ ప్రయాణిస్తున్న కారు.. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ టీనేజర్ (18) అక్కడిక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా పవిత్రా రాయ్ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు చుట్టుముట్టి కారును ఆపారు. పవిత్రా రాయ్ కారు దిగకుండా వీరంగం సృష్టించాడు. కారు లోపల నుంచే జనంపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కారులో పవిత్రా రాయ్‌తో పాటు ఐదుగురు ఉన్నారు. ఆదివారం రాత్రి పోలీసులు టీఎంసీ నేతను అరెస్ట్ చేశారు. ఆయనతో కలసి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాగా పవిత్రా రాయ్ కాల్పులు జరిపిన ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.