గురుదాస్పూర్: పంజాబ్లో విద్యార్థులు, స్టాఫ్ ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ సరిహద్దు గ్రామం మాంగియా వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. అయితే విద్యార్థులు, ఇతర సిబ్బంది తృటిలో్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
స్కూల్ సయమం ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకెళ్తున్న సమయంలో.. నలుగురు దుండగులు కారులో వచ్చి బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరాయ్యారు. ఈ సంఘటనలో ఎవరికి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులు వెళ్తున్న స్కూల్ బస్సుపై కాల్పులు
Published Wed, Jul 30 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM
Advertisement
Advertisement