Gang Wars
-
అమెరికాలో మళ్లీ కాల్పులు
తంపా (యూఎస్): అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున రెండు గ్యాంగుల మధ్య పోరాటం కాల్పుల దాకా వెళ్లడంతో ఇద్దరు మరణించారు. 18 మంది దాకా గాయపడి ఆస్పత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతమంతా బార్లు, క్లబ్బులతో, లేట్ నైట్ కార్యకలాపాలతో నిండి ఉంటుంది. అనుమానితుల్లో ఒకరు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయారు. మిగతావారి కోసం గాలింపు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఘటన... జార్జియా యూనివర్సిటీ అట్లాంటా క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
రాజస్తాన్ గ్యాంగ్‌స్టర్ హత్య.. వెలుగులోకి మరో దారుణం
రాజస్తాన్ గ్యాంగ్ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఐతే ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ రాజుతేత్‌కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్‌పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్‌పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు. (చదవండి: వీడియో: గ్యాంగ్‌వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్ రాజు దారుణ హత్య) -
గల్లీల్లో ఘర్షణ.. టెన్షన్లో జనం
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, మహ్మద్‌నగర్, న్యూ పటేల్‌నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులకు కనిపించని స్పందన.. ► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు. నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తులో యువత హంగామా.. ► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. చదవండి: మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల -
ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది..
బనశంకరి(కర్ణాటక): బీదర్– కలబుర్గి జిల్లాల సరిహద్దుల్లో భీమా నది ప్రవాహం రక్తంతో ఎరుపెక్కుతోంది. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్య పోరు, కిరాయి హంతక ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. నదిని ఆనుకుని ఉండే అఫ్జల్‌పుర, చడచణ, దేవనగావ్, ఆల్మేల, ఉమ్రాణి గ్రామాలను దాటుకుని ఈ హింస విస్తరించింది. బైరగొండ వర్సెస్ చడచణ ఉమ్రాని గ్రామంలో బైరగొండ, చడచణ అనే రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రక్తసిక్తమైంది. ఒక కుటుంబం ఒక శత్రువును చంపితే, ప్రతీకారంగా మరో కుటుంబం ఇద్దరిని హతమారుస్తోంది. ఇది ఎడతెగని వ్యవహారంగా మారింది. ఈ పగలకు సుమారు యాభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒక అంచనా. ఇందులో అనేకమంది శవాలు భీమా నదిలో దొరకకుండా పోయాయి. సోమవారం కాంగ్రెస్ నేత, ముఠా నాయకుడు మహదేవ సాహుకార బైరగొండపై సినీ ఫక్కీలో జరిగిన దాడి ఈ మారణహోమానికి తాజా ఉదాహరణ. (చదవండి: అశ్లీల వీడియో: పూనమ్ పాండేపై కేసు) 1984లో బీజం కొన్నినెలలుగా ప్రశాంతంగా ఉన్న భీమా తీర గ్రామాల్లో ఈ దాడితో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. 1984 నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం మొదలైంది. మహిళ గొడవకు సంబంధించి ఉమ్రాణి గ్రామంలో శాంతప్ప చడచణ అనే వ్యక్తిని పంచాయతీకి పిలిచారు. పంచాయతీ చేస్తున్న సమయంలో శాంతప్పచడచణను ప్రత్యర్థులు అక్కడే అంతమొందించడంతో హత్యాకాండకు తెరలేచింది. బైరగొండ కుటుంబమే దీనికి కారణమని అనుమానం వ్యక్తమైంది. దీంతో బైరగొండ, చడచణ కుటుంబాలు పరస్పర ప్రతీకార ద్వేషంతో రగిలిపోయాయి. అప్పటి నుంచి నేటి వరకు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం, పగ చల్లారలేదు. రెండు కుటుంబాలు దాడులకు దిగుతూ ఎంతో ప్రాణనష్టాన్ని చవిచూశాయి. 1984లో చడచణ గ్రామ బస్టాండులో శ్రీశైల బైరగొండ, అతని అనుచరుడు హత్యకు గురికాగా చడచణ కుటుంబమే కారణమని అనుమానం వ్యక్తమైంది. 2008 లో పుత్రప్ప సాహుకార బైరగొండ ఎన్నికల ప్రచారం నుంచి వస్తుండగా ఇండి తాలూకా లోణిబీకే గ్రామం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తీవ్ర గాయాలతో రెండేళ్లపాటు సతమతమై మరణించాడు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..) మినీ నేర సామ్రాజ్యం ఈ తరహాలతో చడచణ– బైరగొండ కుటుంబాల మధ్య వైరం అండచూసుకుని అనేక ముఠాలు పుట్టుకొచ్చాయి. సెటిల్మెంట్లు, అక్రమ తుపాకుల విక్రయాల్లో పేరుగాంచాయి. రాజకీయ నేతలు తమ పలుకుబడి కోసం ముఠాలను చేరదీయడంతో కొన్నేళ్లు ఎదురు లేకుండాపోయింది. ముఠాల నేరగాళ్లు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ కిరాయి హంతకులుగానూ మారారు. ప్రత్యర్థుల దాడులు, పోలీసు ఎన్కౌంటర్లలో బడా ముఠాల నాయకులు మట్టి కరిచారు. ఎన్కౌంటర్లు 2017 అక్టోబరు 30 తేదీన ధర్మరాజ చడచణ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. అతని సోదరుడు గంగాధర చడచణ అనుమానాస్పదంగా చనిపోయాడు. బైరగొండ కుటుంబమే ఇది చేయించిందని అనుమానం వ్యక్తమైంది. మహదేవ బైరగొండ అనుచరులతో పాటు 15 మందిపై కోర్టులో పోలీసులు చార్జిïÙట్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. మహదేవ సాహుకార బైరగొండ అతడి అనుచరులు ఈ కేసులో జామీనుపై విడుదలయ్యారు. -
బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్‌కు సంబంధించి కేసులో కొత్త కోణం వినిపిస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంతో పండుకు సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి పండుకు రూ.15వేలు ఇవ్వాలని, డబ్బులు తీసుకునేందుకు ఆయన వద్దకు వెళ్లాడని.. ఆ సమయంలోనే సందీప్ పెనమలూరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారని పండు కుటుంబ సభ్యులు తెలిపారు. (గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే!) సెటిల్మెంట్లో పండు వచ్చి కూర్చోవడంతో సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, ఇంటికి అనుచరులతో వచ్చి బెదిరింపులకు దిగారని పండు కుటుంబసభ్యులు అంటున్నారు. ‘‘ఒకసారి మాట్లాడాలని పిలిచి పండు హత్యకు సందీప్ ప్లాన్ చేశాడు. సందీప్ పిలవడంతో పటమట వెళ్లిన పండుపై సందీప్ అనుచరులు దాడి చేశారు. ఆ ఘర్షణలోనే సందీప్ కత్తిపోట్లకు గురై మృతిచెందాడని’’కుటుంబసభ్యులు చెబుతున్నారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’) -
గ్యాంగ్‌వార్ కేసు కొలిక్కి!
-
గ్యాంగ్‌వార్‌లో మాజీ రౌడీ షీటర్ మృతి
-
ఢిల్లీలో రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు
-
సీఎం ఇలాకాలో..రాజకీయ కక్షలు
బరంపురం ఒరిస్సా : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలో కొద్ది నెలల నుంచి రాజకీయ కక్షలు రాజుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో సొంత నిమోజకవర్గమైన దిగపండిలో కాంగ్రెస్, బీజేడీ పార్టీలకు చెందిన వర్గాల మధ్య రాజకీయ కక్షలు రాజుకున్నాయి. మరో ఐదు నెలల్లో జరగనున్న జమిలి ఎన్నికల నేపథ్యంలో గంజాం జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైంది. జిల్లాలోని దిగపండి నియోజకవర్గంలో రెండు పార్టీలకు చెందిన ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మారణాయుధాలు, బాంబు దాడులతో అధిపత్యం సాధించేందుకు యత్నించారు. రెండు రోజుల క్రితం దిగపండి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పద్మనాభపూర్‌లో జరిగిన బాంబుల దాడి సంఘటనే దీనిని రుజవు చేస్తోంది. ఇదే విధంగా రంబా దగ్గర కృష్ణి కేశ్పూర్, తొంటియా గ్రామాల మధ్య బీజేపీ, బీజేడీ పార్టీల నాయకులు ఆధిపత్యం సాధించేందుకు ఇరు వర్గాల కీలక మద్దతుదారులు మారణాయుధాలు, బాంబు దాడులు చేసుకుని బీభత్సాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు చొరవ తీసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. మరో వైపు రొంగాయిలొండా బ్లాక్ పరిధి ఎకసింగ్పూర్ గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాజుకున్న రాజకీయ కక్షలు ప్రశాంతంగా ఉన్నాయనుకుంటే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్, బీజేడీ నాయకుల మధ్య పరస్పపర దాడులు జరగడంతో గోళంతరా పోలీసులు ఇరువర్గాల వారిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిని వెంటనే రాజకీయ నాయకుల ఒత్తిడితో పోలీసులు విడిచి పెట్టినట్లు తీవ్ర అరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అస్కాలో రాజకీయ అధిపత్యం కోసం అధికార పార్టీ బీజేడీకి చెందిన నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటీవల బీజేడీలో చేరిన రాజకీయ నాయకులపై దాడులు చేయించడం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా చికిటి, గంజాం, ఛత్రపూర్, హింజిలికాట్ సరగడ, సురడా, సన్నోఖేముండి బ్లాక్‌లలో కూడా జరిగిన వివిధ సంఘటనలను బట్టి రాజకీయ కక్షలు జోరుగా రాజుకుంటున్నట్లు జిల్లాలోని రాజకీయ పరిశీలకులు, మేధావులు, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీలో గ్యాంగ్‌వార్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్ సభ్యులతోపాటు దారిన వెళ్తున్న మరో ఇద్దరు చనిపోయారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం లో బలవంతపు వసూళ్లు, హత్య కేసుల సంబంధమున్న టిల్లు, గోగి గ్యాంగ్‌లు పనిచేస్తున్నాయి. టిల్లు గ్యాంగ్ వాహనాన్ని, గోగి గ్యాంగ్ సభ్యుల వాహనం ఢీకొంది. దీంతో ఈ రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు దిగారు. -
కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు..వెర్రెత్తీ.. ఉన్నోళ్లు...!
ఖమ్మంక్రైం : నగరంలోని నిజాంపేట ప్రాంతం. కొందరు యువకులు రోడ్డు పైకి వచ్చారు. రెండుగా విడిపోయారు. ఆవేశంతో ఊగి పోతున్నారు. ఒకరినొకరు మింగేసేంత కోపం తో గుడ్లురిమి చూసుకుంటున్నారు. ఏం జరిగిందోనని చుట్టుపక్కల వారు ఆరా తీయసాగారు. ఇంతలోనే ఆ యువకుల చేతులు కలిశాయి. కొందరి చేతుల్లోకి అప్పటికప్పుడు కర్రలొచ్చాయి. ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియదు... ఎందుకు కొడుతున్నారో తెలి యదు. అంతలోనే పోలీసులొచ్చారు. పారి పోతున్న కొందరు యువకులను పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటల్లోనే ఆ యువకులు రొమ్ము విరుచుకుంటూ, ‘విజయ గర్వం’(??)తో బయటికొచ్చారు. నగరంలోని గట్టయ్య సెంటర్లో ఇనుప రాడ్లు, క్రికెట్ బ్యాట్లతో రెండు గ్రూపులుగా రోడ్డు పైకి వచ్చి దెబ్బలాడుకుంటున్న యువకులను పోలీసులు తీసుకెళ్లారు. గంటల వ్యవధిలో ఆ యువకులు కాలర్ ఎగరేసుకుంటూ బయటికొచ్చారు. ఒక రోజున నిజాంపేట...మరో రోజున గట్టయ్య సెంటర్...సేమ్ టు సేమ్...గ్యాంగ్.. గ్యాంగ్.. గ్యాంగ్ లీడర్...! నగరంలో ఇటీవలి కాలంలో కొందరు విద్యార్థులు, యువకులు, జులాయిలు ఇలా ‘గ్యాంగ్’గా ఏర్పడి, చిన్న చిన్న విషయాలకే ‘వార్’కు దిగుతున్నారు. ఈ ముఠాలకు నాయకత్వం వహిస్తున్న యువకులు తమను తాము ‘గ్యాంగ్ లీడర్’గా ఊహించు కుంటున్నారు. తమ భవిష్యత్తును తామే దెబ్బ తీసుకుంటున్నారు. పోలీసుల చోద్యం..! ఈ యువకులు ఇలా రోడ్లపైకి వచ్చి తన్నుకుం టుంటే పోలీసులు ఏం చేస్తున్నారోనని మీకు సందేహం రావచ్చు. పాపం.. వారు మాత్రం ఏం చేస్తారు... చోద్యం చూస్తున్నారు...! నిజమే... ఇది, వారిని తప్పుపడుతూ అంటున్న మాట కాదు..!! ఇలా తన్నుకుంటున్న వారిలో విద్యార్థులు, యువకులు, జులాయిలు.. ఇలా రకరకాల వారు ఉంటున్నారు. వీరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రంగంలోకి దిగుతున్నారు. కొందరైతే పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి, ‘‘ఫలానా పిల్లలు మావాళ్లే. వదిలేయండి’’ అని చెబుతున్నారు. ఇంకొందరైతే, నేరుగా స్టేషన్‌కు వెళ్లి బయటకు తీసుకొచ్చు కుంటున్నారు. ఇది పదేపదే పునరావృత మవుతుండడంతో పోలీసులు కూడా విసు గెత్తారు. అందుకే, ‘గ్యాంగ్‌వార్’కు దిగిన వారిని తప్పనిసరి అయితేనే స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. జులాయిలకు వకాల్తా.. తెలిసీతెలియని వయసులో గొడవలకు దిగిన విద్యార్థులనో/యువకులనో నాయకులు విడిపించుకుని వెళ్లారంటే అర్థముంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఇలా జరగడం లేదు. త్రీ టౌన్ ప్రాంతంలోని బొక్కలగడ్డకు చెందిన ఓ రౌడీషీటర్, తన వెంట గ్యాంగ్‌ను వేసుకుని రోడ్లపై ఇష్టారాజ్యంగా భీభత్సం సృష్టిస్తుంటే పోలీసులు వెళ్లారు. చివరికి, పోలీసులపై కూడా ఆ రౌడీషీటర్ తిరగబడ్డాడు. పోలీసులు వాడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. చివరికి, స్టేషన్లో కూడా, ‘‘చూస్కోండి.. మా వాళ్లు వస్తారు’’ అంటూ ఆ రౌడీషీటర్ వీరంగం వేశాడు. వాడు చెప్పిందే నిజమైంది..! ఈ జులాయిల తరఫున కూడా ఆ అధికార పార్టీ నాయకులు వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రౌడీషీటర్‌ను, అతడి గ్యాంగును వదిలిపెట్టేంత వరకు పోలీసులను వదల్లేదు... అంతగా ఒత్తిడి తెచ్చారన్న మాట. ప్చ్.. ఏం చేస్తాం..? ఏమీ చేయలేం..! ఖమ్మంలో ‘గ్యాంగ్ వార్’ సంస్కృతి పెరగడంపై ఓ పోలీస్ అధికారిని ‘సాక్షి’ వివరణ కోరింది. ఆయన చాలా నిర్వేదంతో... ‘‘నిజమే.. గ్యాంగ్ వార్లకు దిగుతున్నారు. అదుపు చేయటానికి మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, మాపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. మా చేతులు కట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేం ఏం చేస్తాం..? ఏమీ చేయలేం’’ అని, నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇలా రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్న యువకు లను చూస్తుంటే.. అప్పుడెప్పుడో ఓ సినీ కవి రాసిన ఈ పాట గుర్తుకొస్తున్నది కదూ...‘కుర్రాళ్లోయ్..! కుర్రాళ్లూ...!! వెర్రెత్తీ.. ఉన్నోళ్లు...!!’ -
సెల్‌ఫోన్ దొంగలున్నారు బహుపరాక్!
నరగంలో పెరుగుతున్న మొబైల్స్ చోరీలు దొంగల అవతారం ఎత్తుతున్న విద్యార్థులూ ‘సర్వం’ కోల్పోతున్న సెల్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు: పోలీసులు బోరబండ న్యూ రామారావునగర్‌కు చెందిన విద్యార్థులు చిట్టిమేల కేతేష్రెడ్డి, మేకల సందీప్ లాలాగూడ, మల్కాజిగిరిలకు చెందిన స్టూడెంట్స్ ప్రదీప్‌కుమార్, కార్తీక్, చైతన్య, మల్కాజిగిరికి చెందిన సుధాకర్ ఆసిఫ్‌నగర్‌లోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న, మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఇరువురు బాలురు సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడి జూబ్లీహిల్స్, గాంధీనగర్ పోలీసులకు చిక్కి గురువారం జైలుకెళ్లిన ముఠాలివి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ హస్తభూషణంగా మారింది. దీని వినియోగం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో... అన్ని నష్టాలూ ఉన్నాయి. సెల్ఫోన్ల వినియోగం పెరిగాక ప్రజల ‘జ్ఞాపక శక్తి’ చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా దీన్ని పోగొట్టుకుంటే... ‘సంబంధాలను’ కోల్పోతున్నారు. మరోపక్క సెల్‌ఫోన్ చోరీ అనేది వ్యవస్థీకృతం మారడంతో ఈ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు 25 వేల సెల్ఫోన్లు చోరీ అవుతున్నాయి. రికార్డుల్లోకి ఎక్కని ఉదంతాల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని పోలీసులే అంటున్నారు. నగరంలో ఒకప్పుడు పిక్‌పాకెటింగ్ చేసే అనేక ఛోటా మోటా ముఠాలు ప్రస్తుతం సెల్‌ఫోన్ స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ స్నాచింగ్ ఎక్కువగా కొనసాగుతోంది. వ్యవస్థీకృత నేరాలు చేసే ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి. సిటీ కాప్స్ సేవలు... ఈ సెల్‌ఫోన్ చోరీల్లో బాధితులకు న్యాయం చేసేందుకుపోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెల్లో స్టోలెన్ మొబైల్ ట్రాకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. నగరంతో పాటు పొరుగు ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల నుంచి చోరీకి గురైన సెల్ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్ల ద్వారా ఇక్కడి అధికారులు వాటిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ యూని ట్‌కు మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో 60 శాతం ఫోన్లను రికవరీ చేయగలిగింది. మరోపక్క ‘లాస్ట్ రిపోర్ట్’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించిన అధికారులు చోరీ కాకుండా పోగొట్టుకున్న మొబైల్స్‌కు సంబంధించిన ధువ్రీకరణ పత్రాన్ని ఠాణాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ-మెయిల్ ద్వారా అందిస్తున్నారు. జాగ్రత్తలే మేలు... ఓ పక్క దొంగలు ఇలా వ్యవస్థీకృతంగా రెచ్చిపోతుంటే... బాధితులకు మాత్రం అన్ని చోట్లా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సెల్‌ఫోన్ పోయిందని పోలీసులను ఆశ్రయిస్తే... వారి నుంచి సరైన స్పందన లభించదు. ఈ కేసులను ఎఫ్ఐఆర్ కూడా చేయడంలేదు. ఫిర్యాదులకు జీడీ ఎంట్రీ పెట్టినా... వాటిపై తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. అనేక మంది బాధితులకు ఫోను పోయిన దాని కంటే.. అందులో డేటా విషయంలోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సన్నిహితులు, బంధు,మిత్రుల ఫోన్ నెంబర్లన్నీ సెల్లోనే ఫీడ్ చేస్తున్నారు. దీంతో గుర్తుంచుకోవడం, నోట్ చేసుకోవడం మర్చిపోయారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు చెప్తున్నారు. {పతి సెల్‌ఫోన్‌కీ 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై) నెంబర్ ఉంటుంది. మొబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్ఫోన్లో (ూు06ు) బటన్లు నొక్కితే ఈ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని దాచుకోవాలి, ఫోను చోరీ అయితే దీని సహాయంతో అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోడం వారి వల్లకాదు. ఇప్పుడు మార్కెట్లోకి ట్రాకింగ్ సాఫ్ట్వేర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని సెల్ఫోన్లో ఇన్‌స్టల్ చేసుకుంటే... అది పోయిన సందర్భంలో ఎవరైనా దక్కించుకుని, అందులో వే రే సిమ్‌కార్డు వేసి వాడటం ప్రారంభించిన వెంటనే మీకు సందేశం వస్తుంది. తద్వారా మీ సెల్ ఆచూకీ తెలుసుకోవచ్చు. {పస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్లతో పాటు జీమెయిల్ తదితర కంపెనీలు ఫోన్‌బుక్ బ్యాకప్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగించుకోవడం ద్వారా మీ ఫోన్లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా కంపెనీ దగ్గర, మీ మెయిల్‌లోనూ బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సురక్షితంగా ఉంటుంది.{పతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది. సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో ముగ్గురు విద్యార్థుల రిమాండ్ యాకుత్‌పురా: కళాశాలలో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఓ విద్యార్థిని డబీర్‌ఫురా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అదనపు ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్ కథనం ప్రకారం....హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన మిస్బా (20) న్యూ మలక్‌పేటలోని నవాబ్ షా ఆలం కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈనెల 5న కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన గోరెటి విష్ణుతో పాటు మరో నలుగురు విద్యార్థులు పరీక్షా కేంద్రం బయట ఉన్న బైక్‌లో తమ సెల్ఫోన్లు ఉంచారు. ఇది గమనించిన మిస్బా... విష్ణు సెల్‌ఫోన్‌ను అపహరించుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా మిస్బాను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కటకటాల్లోకి మరో ఇద్దరు స్టూడెంట్స్... అడ్డగుట్ట: పరీక్ష రాసేందుకు వచ్చిన వారి సెల్ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు విద్యార్థులను తుకారాంగేట్ పోలీసులు జైలుకు పంపారు. వారి నుంచి 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బెన్హర్ (20) డిప్లొమా, కె.విజయ్(19) ఐటీఐ చదువుతున్నారు. వీరిద్దరూ ఈనెల 9న మారేడ్‌పల్లిలోని సెయింట్ జాన్స్ కాలేజీ వద్దకు వెళ్లారు. ఆ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు బైక్‌ల్లో భద్రపర్చిన సెల్ఫోన్లను వీరిద్దరూ ఎత్తుకెళ్లారు. -
గుంటూరు జిల్లాలో బాంబుల మోత
గుంటూరు: పాడుబడిన ఇంట్లో దాచిపెట్టిన నాటు బాంబులు పేలిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాపాయపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు టీచర్ మద్దిగ రామిరెడ్డి ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు దాచి పెట్టగా అవి ఎండ తీవ్రతకు పేలాయి. రామిరెడ్డి ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో ప్రస్తుతం ఎవరూ నివాసం ఉండటంలేదు. అక్కడున్న ఆరు బాంబులను, పలు మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ బాంబులు ఎవరివి? గ్రామంలో ఏడాది నుంచి వర్గ విబేధాలతో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. మద్దిగ రామిరెడ్డి గత ఏడాది హత్యకు గురైన సింగరెడ్డి వెంకటరామిరెడ్డి సమీప బంధువు కావడంతో ఆ బాంబులు తెలుగుదేశం పార్టీ వారివేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆరోపిస్తున్నారు. (బెల్లంకొండ) -
చైనాకు చోరీ ఫోన్లు
=హైఎండ్ మోడల్సే అత్యధికంగా తరలింపు =‘రిటర్న్ మాల్’ ముసుగులో గుట్టుగా రవాణా =పక్కా వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారం =రికవరీలు కష్టంగా మారిన వైనం సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు... చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం.. ఆ తరవాత... ఐఎంఈఐ నెంబర్ల ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం.. ఇప్పుడు.. అత్యంత ఖరీదైన చోరీ సెల్ఫోన్లను గుట్టుగా పొరుగు దేశానికి తరలించడం.. నగరంలో తస్కరణకు గురవుతున్న సెల్ఫోన్లలో అత్యధిక భాగం చైనాకు తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫలితంగానే వీటిని రికవరీ చేయడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా 20 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. నగరంలో అనేక చోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు.. పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి.. ప్రతి సెల్‌ఫోన్‌కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. ఏ రెండు ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్స్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లను దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో నెంబర్ కేటాయించే వారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ ఫోన్లకు వేసే వారు. దీనివల్ల చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏకంగా సరిహద్దులు దాటిస్తూ.. ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి పలు వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం సాధారణమై పోయింది. ఇలా వచ్చిన దాంట్లో కొంత వివిధ కారణాల నేపథ్యంలో తిరిగి పంపిస్తారు. వీటితో కలిపి చోరీ ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై-ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపిస్తున్నట్లు నిర్ధారిస్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన హై-ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు చెబుతున్నారు. దీని వెనుకున్న సూత్రధారులపై పోలీసులు కన్నేశారు. జాగ్రత్తలే మేలు.. సెల్ఫోన్లు కోల్పోయిన బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ఫలితంగా ఫోన్ పోతే.. దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కీ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మీ సెల్ఫోన్లో బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకోవాలి. ఫోను పోతే దీన్ని బట్టి ఆచూకీ కనుక్కోవచ్చు. మీ సెల్‌ఫోన్‌కు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా.. వినియోగించుకోడం వారి, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా విలువైన డేటా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఫోన్ నెంబర్లను సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తాన్ని కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం/రాసి పెట్టుకోవడం మంచిది