
సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్‌కు సంబంధించి కేసులో కొత్త కోణం వినిపిస్తోంది. ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంతో పండుకు సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి పండుకు రూ.15వేలు ఇవ్వాలని, డబ్బులు తీసుకునేందుకు ఆయన వద్దకు వెళ్లాడని.. ఆ సమయంలోనే సందీప్ పెనమలూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ చేస్తున్నారని పండు కుటుంబ సభ్యులు తెలిపారు. (గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే!)
సెటిల్‌మెంట్‌లో పండు వచ్చి కూర్చోవడంతో సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, ఇంటికి అనుచరులతో వచ్చి బెదిరింపులకు దిగారని పండు కుటుంబసభ్యులు అంటున్నారు. ‘‘ఒకసారి మాట్లాడాలని పిలిచి పండు హత్యకు సందీప్ ప్లాన్ చేశాడు. సందీప్ పిలవడంతో పటమట వెళ్లిన పండుపై సందీప్ అనుచరులు దాడి చేశారు. ఆ ఘర్షణలోనే సందీప్ కత్తిపోట్లకు గురై మృతిచెందాడని’’కుటుంబసభ్యులు చెబుతున్నారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’)
Comments
Please login to add a commentAdd a comment