land settlement
-
పరిగి ఎమ్మేల్యే అనుచరుల దౌర్జన్యం
-
బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్‌కు సంబంధించి కేసులో కొత్త కోణం వినిపిస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంతో పండుకు సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి పండుకు రూ.15వేలు ఇవ్వాలని, డబ్బులు తీసుకునేందుకు ఆయన వద్దకు వెళ్లాడని.. ఆ సమయంలోనే సందీప్ పెనమలూరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారని పండు కుటుంబ సభ్యులు తెలిపారు. (గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే!) సెటిల్మెంట్లో పండు వచ్చి కూర్చోవడంతో సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, ఇంటికి అనుచరులతో వచ్చి బెదిరింపులకు దిగారని పండు కుటుంబసభ్యులు అంటున్నారు. ‘‘ఒకసారి మాట్లాడాలని పిలిచి పండు హత్యకు సందీప్ ప్లాన్ చేశాడు. సందీప్ పిలవడంతో పటమట వెళ్లిన పండుపై సందీప్ అనుచరులు దాడి చేశారు. ఆ ఘర్షణలోనే సందీప్ కత్తిపోట్లకు గురై మృతిచెందాడని’’కుటుంబసభ్యులు చెబుతున్నారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’) -
ఖాకీల భూదందా!
సంగారెడ్డిలో భూ వివాదంలో రాచకొండ అడిషనల్ డీసీపీ - నిర్బంధించి రూ.60 లక్షల చెక్‌లపై సంతకం - సహకరించిన మరో ముగ్గురు పోలీసులు - బాధితుడి ఫిర్యాదుతో పోలీసులపై కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: భూసెటిల్మెంట్ వ్యవహారంలో బాధితుడిని నిర్బంధించి..రూ.60 లక్షల చెక్కులపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న కేసులో రాచకొండ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ పులిందర్‌రెడ్డిపై కేసు నమో దైంది. ఇందులో అతనికి సహకరించిన రాయ దుర్గం ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణలపైనా సైబ రాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలతో కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అడ్వాన్సులిచ్చి కాలయాపన... సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ముత్తంగి గ్రామంలో ఇరువురు రైతులకు ఎకరం భూమి ఉంది. దీన్ని కొనుగోలు చేస్తానంటూ వారిని సంప్రదించిన ముజీబ్.. రూ.కోటికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగిలిన డబ్బులివ్వకుండా ముజీబ్ కాలం వెళ్లదీస్తున్నాడు. అదే సమయంలో రియల్ఎస్టేట్ బ్రోకర్ అబూబకర్, అతని సోదరుడు అబ్దుల్లా ఆ భూమిని రూ.కోటికి కొంటామని రైతులను సంప్రదించారు. ముజీబ్ ఇచ్చిన అడ్వాన్స్‌ను తాము అతనికి చెల్లిస్తామని రైతులను ఒప్పించారు. అండగా ఉంటాడని తనకు పరిచయమున్న రాచకొండ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ పులిందర్‌రెడ్డికి విషయాన్ని చెప్పాడు అబూబకర్. భవిష్యత్తులో తలనొప్పులు రాకుండా ఉండేందుకు అగ్రిమెంటులో తన కుమార్తె ఐశ్వర్యారెడ్డి పేరునూ చేర్చాలని పులిందర్ సూచించాడు. అందుకు ఓకే అన్న అబూబకర్.. రైతులకు రూ.20 లక్షలు చెల్లించి, అగ్రిమెంటులో ఐశ్వర్య పేరూ రాయించాడు. అయితే ఎన్ని రోజులవుతున్నా మిగిలిన డబ్బు సమకూరక అబూబకర్ సోదరులు రైతుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో సదరు భూమిని కొనుగోలు చేస్తా మని వచ్చిన గంగాధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలతో రూ.1.10 కోట్లకు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమయంలో ముజీబ్ ఇచ్చిన అడ్వాన్స్ రూ.10 లక్షలకు అదనంగా రూ.15 లక్షలు, అబూబకర్ సోదరులు ఇచ్చిన రూ.20 లక్షలకు అదనంగా రూ.10లక్షలు కలిపి గంగా ధర్, రవీందర్ వారికి చెల్లించారు. మిగిలింది రైతులకు ఇచ్చేసి అంతా క్లియర్ చేసుకున్నారు. మరో రూ.75 లక్షలొచ్చేవి..!: విషయం తెలుసుకున్న పులిందర్రెడ్డి రంగంలోకి దిగా డు. తనకు తెలియకుండానే రైతుల నుంచి అడ్వాన్స్ వెనక్కి ఎందుకు తీసుకున్నావంటూ అబూబకర్‌పై ఫైరయ్యాడు. అక్కడ ఎకరం దాదాపు రూ.2కోట్లు పలుకుతుందని, అడ్వా న్స్ తిరిగివ్వకుంటే మరో రూ.75 లక్షలు వచ్చే వని వాపోయాడు. అగ్రిమెంటు చేసుకున్న అబూబకర్ తనను మోసం చేశాడంటూ కుమా ర్తె ఐశ్వర్యారెడ్డితో పులిందర్రెడ్డి జూలై 25న రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. మరుసటి రోజు ఉదయం 9కి పుప్పాలగూడ లో ఉండే అబూబకర్ ఇంటికి మరికొంతమంది తో వెళ్లిన పులిందర్రెడ్డి.. అతడిని రాయదుర్గం ఠాణాకు తీసుకొచ్చాడు. రాత్రి 10 వరకు స్టేషన్లోనే నిర్బంధించి రూ.60 లక్షల విలువైన ఐదు చెక్కులు, తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించాడు. అబూబకర్ వద్దనున్న రూ. 49 వేల నగదు కూడా లాక్కుని వదిలేశాడు. ఫిర్యాదుతో వెలుగులోకి.. దీనిపై అబూబకర్ శనివారం సైబరా బాద్ సీపీ సందీప్‌శాండిల్యను కలసి ఫిర్యా దు చేశాడు. సీపీ ఆదేశాలతో పులిందర్‌రెడ్డితో పాటు, మరో ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితుడు పీఎస్‌కు వచ్చి వెళ్లిన సమయమంతా సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్‌ను విచా రణాధికారిగా నియమించారు. 2015లో సైబరాబాద్‌లో ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్న సమయంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పులిందర్రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. -
పోలీస్ సెటిల్మెంట్
-
తుపాకుల కలకలం వెనుక కథేంటి?
ప్రశాంతంగా ఉండే చోట ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులు రాజ్యమేలుతున్నాయి. కిరాయి హంతకముఠాలు హల్చల్ చేస్తున్నాయి. నేరాల రేటు తక్కువగా ఉండే మెదక్ జిల్లా నంగునూరు మండలంలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు పరస్పరం ఘర్షణ పడగా ఒకరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో ముగ్గురు పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి దొరికాడు. ఆ ఇంట్లో రెండు తుపాకులు, ఒక తపంచా దొరికాయి. వీరు ఏదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయిన వ్యక్తుల వద్ద పెద్దబ్యాగ్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్మెంట్ చేసి సంపాదించన డబ్బు పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నంగునూరు మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్లో ఉండడంతో అసాంఘిక శక్తులు అడ్డాగా మార్చుకుంటున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నంగునూరు మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని ఆశచూపి కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వినికిడి. అయితే, వారికి డబ్బు అందజేసిన వారు ఒత్తిడి చేయటంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రదాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్.. గత డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న 200క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి మెదక్ జిల్లా రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటుంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నంగునూరు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతంలో దాబా హోటళ్లు ఉండడంతోపాటు మద్యం లభిస్తుండటం కూడా అసాంఘిక శక్తులకు ఆసరాగా మారింది. -
పేట్రేగుతున్న రౌడీషీటర్లు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : అసాంఘిక శక్తులపై రౌడీషీట్ తెరిచిన పోలీసులు.. అందులో వారి వివరాలు పొందుపరచడం మరిచిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారు.. ఇందులో పాతవారు ఎందరు.. కొత్తగా నమోదైన వారెందరు.. ఎవరైనా తమ ప్రవర్తనను మార్చుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారా.. వంటి సమాచారమేదీ ఉన్నతాధికారుల వద్ద లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రౌడీ షీటర్లపై పోలీసులు దృష్టి సారించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. చిన్నా చితకా దందాలు చేసి పూట గడిపే రౌడీషీటర్లు ప్రస్తుతం నగరాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. కిరాయి హత్యలు, మాట వినకపోతే బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అధిక వడ్డీలు, అత్యాచారాలకు తె గబడుతున్నారు. పోలీసుల ఉదాసీన వైఖరే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రౌడీ షీటరూ ఏదో ఒక రాజకీయ పార్టీ అండ చూసుకుని పేట్రేగిపోతున్నాడు. రాజకీయ పార్టీల నేతలు అడిగిన పని చిటికెలో చేసి పెడుతున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే వణికిపోయే రౌడీమూకలు నాయకుల పేరు చెప్పుకుని ఏకంగా పోలీస్స్టేషన్లలోనే పంచాయితీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలో 229 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో అత్యధికంగా 130, టూటౌన్ పరిధిలో 80, త్రీటౌన్ పరిధిలో 38 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు వయసు మళ్లినవారు ఉండటంతో వారిపై రౌడీషీట్ ఎత్తేశారు. మరో పది మందిపై రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసు ఉన్నతాధికారుల అనుమతి కోసం జాబితాను పంపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 100 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు వృద్ధులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెద్దలకు కౌన్సెలింగ్ లేదట : రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న రౌడీషీటర్ల (పెద్దల)కు పోలీస్ కౌన్సెలింగ్ ఉండదట. చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై మాత్రం విరుచుకుపడే పోలీసులు.. ఆ పెద్దలకు ఎందుకు కౌన్సెలింగ్ ఇవ్వలేదని అడిగితే... వారు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని సమాధానమిస్తున్నారు. నగర శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ పెద్దమనిషి దందాలు చేస్తున్నా.. అధికారులకు కనిపించవు.. వినిపించవు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు రౌడీషీటర్లే అస్త్రాలు:ఎన్నికలు సమీపిస్తుండటంతో కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల శాతం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు అండగా ఎవరు నిలుస్తున్నారనే దానిపై రహస్య సర్వేలు చేయించి గుర్తించాయి. ఆ వ్యక్తులను బెదిరించి.. ఆయా వర్గాల ఓట్లను తమవైపు మళ్లించుకునేందుకు రౌడీషీటర్లను అస్త్రాలుగా వాడుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇందు కోసం రౌడీషీటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొన్ని సెటిల్మెంట్లు.. దందాలు అప్పగించారని తెలిసింది. బకాయి వేతనం చెల్లించండి వీవోఏల సంఘం వినతి అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఇందిరా క్రాంతి పథకంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ)లకు ఏడు నెలల బకాయి వేతనం వెంటనే చెల్లించాలని వీవోఏ ఉద్యోగుల సంఘం నేతలు డీఆర్డీఏ-ఐకేపీ పీడీ కె.నీలకంఠరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు ఎం.బాబు, ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, ఉద్యోగులు సోమవారం పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు.గత ఏడాది ఆగస్టు నుంచి వేతన బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన జూన్,జూలై మాసాల వేతనం కూడా ఇంతవరకూ అందలేదన్నారు. రూ.2 వేల వేతనం ఇస్తామన్న హామీ ఇప్పటిదాకా అమలులోకి రాలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు టి.శివ, నాగరాజు, శ్రీనివాసులు, పి.నాగయ్య, గంగభూషణ, డాక్యానాయక్, శీనప్ప తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ మస్దూర్ యూనియన్ నాయకులు ఆర్టీసీ ఆర్ఎంకు విన్నవించారు. సోమవారం ఆర్ఎం చాంబర్లో ఆయనను కలిసి 38 సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రీజనల్ కార్యదర్శి భాస్కర్‌నాయుడు మాట్లాడుతూ, సంస్థ ప్రగతి కోసం నిరంతరం శ్రమించే కార్మికులు కొందరు అధికారుల వైఖరితో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. టికెటింగ్ యంత్రాల వినియోగంతో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా పోయిందని, ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి డ్యూటీలను యాక్టుకు అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేశారు. బెంగుళూరులో బస్సులకు పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్ డ్యామేజీ అయిన బస్సులను జడ్డబ్ల్యుఎస్కు పంపాలన్నారు.