కలబురిగి– బీదర్ జిల్లాల మధ్యనున్న భీమా నది. ఈ తీర గ్రామాల్లో పగ ప్రతీకారాల జ్వాల
బనశంకరి(కర్ణాటక): బీదర్– కలబుర్గి జిల్లాల సరిహద్దుల్లో భీమా నది ప్రవాహం రక్తంతో ఎరుపెక్కుతోంది. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్య పోరు, కిరాయి హంతక ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. నదిని ఆనుకుని ఉండే అఫ్జల్‌పుర, చడచణ, దేవనగావ్, ఆల్మేల, ఉమ్రాణి గ్రామాలను దాటుకుని ఈ హింస విస్తరించింది.
బైరగొండ వర్సెస్ చడచణ
ఉమ్రాని గ్రామంలో బైరగొండ, చడచణ అనే రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రక్తసిక్తమైంది. ఒక కుటుంబం ఒక శత్రువును చంపితే, ప్రతీకారంగా మరో కుటుంబం ఇద్దరిని హతమారుస్తోంది. ఇది ఎడతెగని వ్యవహారంగా మారింది. ఈ పగలకు సుమారు యాభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒక అంచనా. ఇందులో అనేకమంది శవాలు భీమా నదిలో దొరకకుండా పోయాయి. సోమవారం కాంగ్రెస్ నేత, ముఠా నాయకుడు మహదేవ సాహుకార బైరగొండపై సినీ ఫక్కీలో జరిగిన దాడి ఈ మారణహోమానికి తాజా ఉదాహరణ. (చదవండి: అశ్లీల వీడియో: పూనమ్ పాండేపై కేసు)
1984లో బీజం
కొన్నినెలలుగా ప్రశాంతంగా ఉన్న భీమా తీర గ్రామాల్లో ఈ దాడితో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. 1984 నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం మొదలైంది. మహిళ గొడవకు సంబంధించి ఉమ్రాణి గ్రామంలో శాంతప్ప చడచణ అనే వ్యక్తిని పంచాయతీకి పిలిచారు. పంచాయతీ చేస్తున్న సమయంలో శాంతప్పచడచణను ప్రత్యర్థులు అక్కడే అంతమొందించడంతో హత్యాకాండకు తెరలేచింది. బైరగొండ కుటుంబమే దీనికి కారణమని అనుమానం వ్యక్తమైంది. దీంతో బైరగొండ, చడచణ కుటుంబాలు పరస్పర ప్రతీకార ద్వేషంతో రగిలిపోయాయి. అప్పటి నుంచి నేటి వరకు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం, పగ చల్లారలేదు. రెండు కుటుంబాలు దాడులకు దిగుతూ ఎంతో ప్రాణనష్టాన్ని చవిచూశాయి. 1984లో చడచణ గ్రామ బస్టాండులో శ్రీశైల బైరగొండ, అతని అనుచరుడు హత్యకు గురికాగా చడచణ కుటుంబమే కారణమని అనుమానం వ్యక్తమైంది. 2008 లో పుత్రప్ప సాహుకార బైరగొండ ఎన్నికల ప్రచారం నుంచి వస్తుండగా ఇండి తాలూకా లోణిబీకే గ్రామం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తీవ్ర గాయాలతో రెండేళ్లపాటు సతమతమై మరణించాడు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..)
మినీ నేర సామ్రాజ్యం
ఈ తరహాలతో చడచణ– బైరగొండ కుటుంబాల మధ్య వైరం అండచూసుకుని అనేక ముఠాలు పుట్టుకొచ్చాయి. సెటిల్మెంట్లు, అక్రమ తుపాకుల విక్రయాల్లో పేరుగాంచాయి. రాజకీయ నేతలు తమ పలుకుబడి కోసం ముఠాలను చేరదీయడంతో కొన్నేళ్లు ఎదురు లేకుండాపోయింది. ముఠాల నేరగాళ్లు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ కిరాయి హంతకులుగానూ మారారు. ప్రత్యర్థుల దాడులు, పోలీసు ఎన్‌కౌంటర్లలో బడా ముఠాల నాయకులు మట్టి కరిచారు.
ఎన్‌కౌంటర్లు
2017 అక్టోబరు 30 తేదీన ధర్మరాజ చడచణ అనే వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. అతని సోదరుడు గంగాధర చడచణ అనుమానాస్పదంగా చనిపోయాడు. బైరగొండ కుటుంబమే ఇది చేయించిందని అనుమానం వ్యక్తమైంది. మహదేవ బైరగొండ అనుచరులతో పాటు 15 మందిపై కోర్టులో పోలీసులు చార్జిïÙట్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. మహదేవ సాహుకార బైరగొండ అతడి అనుచరులు ఈ కేసులో జామీనుపై విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment