Bengaluru double murder: 3 accused of company's CEO, MD to death arrested - Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఘోరం.. టెక్‌ కంపెనీ సీఈఓ, ఎండీ దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్‌

Published Wed, Jul 12 2023 10:01 AM | Last Updated on Wed, Jul 12 2023 10:34 AM

Bengaluru double murder: 3 accused arrested In Company CEO MD Death - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఉన్మాదిగా మారిన ఓ మాజీ ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈఓ, ఎండీలను కత్తితో పొడిచి చంపాడు. అమృతహళ్లి పంపా లేఔట్‌లో ఈ ఘోరం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్‌ ఏరోనిక్స్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ, సీఈఓలుగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆఫీసులోకి చొరబడిన జోకర్‌ ఫెలిక్స్‌ అనే మాజీ ఉద్యోగి కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ కంపెనీలో పనిచేసే నిందితుడు ఫెలిక్స్‌ ఇక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. తన వ్యాపారానికి ఫణీంద్ర, వినుకుమార్‌లు అడ్డు తగులుతున్నారని అనుమానించి ఆఫీస్‌కొచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బెంగుళూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. 
చదవండి: తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement