
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.
The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025