ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట | Bengaluru Couple Moves to One of World Smallest Country Here is The Reason | Sakshi
Sakshi News home page

ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట

Published Thu, Sep 5 2024 1:39 PM | Last Updated on Thu, Sep 5 2024 1:55 PM

Bengaluru Couple Moves to One of World Smallest Country Here is The Reason

చాలా మంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి లేదా కొత్త పద్ధతులు, విధానాలకు ఆకర్షితులై ఇండియా వదిలి విదేశాల్లో నివాసముండిపోతున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన 'ప్రతీక గుప్తా, నేహా మహేశ్వరి' దంపతులు జంట ట్యాక్స్ తగ్గుతుందని, ఎక్కువ పొదుపు చేయొచ్చని, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌లో స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడటం వల్ల లాభాలు ఏంటనే విషయాలను కూడా వారు వెల్లడించారు.

ప్రతీక గుప్తా అమెజాన్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్‌గా, నేహా శర్మ రియర్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాలు చేశారు. ఇండియాలో పనిచేయడం వల్ల ఇంక్రిమెంట్స్ వచ్చేవి. అయితే దుబాయ్ లేదా అమెరికాలలో ఉద్యోగాలు చేసే చాలా డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.

దుబాయ్, అమెరికాల కంటే యూరప్ దేశాలలో జీవన నైపుణ్యం బాగుందని వారు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనుకునే వారు యూరప్‌ దేశాలకు రావడం తక్కువే. అయితే ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా కంటే కూడా యూరప్‌లో తక్కువ. ఇది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని సర్వీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రతీక, నేహా చెప్పుకొచ్చారు. ఇక్కడ మన సంపాదనలో మూడు శాతం తప్పనిసరిగా ఆరోగ్యభీమాకు అందించాలి.

ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్

లక్సెంబర్గ్‌లో ప్రతీక్, నేహలకు ఇష్టమైన మరో అంశం నిరుద్యోగ నిధి. దీనికి వారిరువురు.. తమ ఆదాయంలో రెండు శాతం విరాళంగా ఇవ్వాలి. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే.. రెండు సంవత్సరాలు లేదా ఉద్యోగం దొరికే వరకు చివరగా తీసుకున్న జీతంలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తుందని వారు వివరించారు.

లక్సెంబర్గ్‌లో నివసించడం వల్ల లభించే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇక్క లగ్జరీ కార్ల ధరలు కూడా చాలా తక్కువ. నేహా, ప్రతీక్ దంపతులకు అక్కడ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు ఉంది. ఈ కారు ధర మన దేశంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ. కానీ లక్సెంబర్గ్‌లో దీని ధర కొంత తక్కువే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement