Company CEO
-
యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి రూ.1400 కోట్ల కంపెనీ సీఈవోగా
దూరదర్శన్‌లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్‌కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈ పాపులర్ సీరియల్లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే. బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్‌లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కమిషన్ జంక్షన్లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ సీరియల్లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. -
వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం
Atlassian CEO Scott Farquhar కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ సమయంలో కంపెనీలకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' బాగా ఉపయోగపడింది. కరోనా తగ్గిపోవడంతో దాదాపు అన్ని కంపెనీలు 'హైబ్రిడ్' విధానానికి స్వస్తి పలికి, ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నాయి. ముఖ్యంగా 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' విధానాన్ని సమర్ధిస్తున్న వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రముఖంగా నిలుస్తారు. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులనుంచి తక్కువ ఫలితం ఉంటుందనేది ఆయన వాదన. అయితే అట్లాసియన్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో బిలియనీర్ స్కాట్ ఫర్క్హార్ మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నాడు 2023లో 8.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఆస్ట్రేలియాలో 7వ అత్యంత సంపన్నుడైన స్కాట్ ఇంటి నుండి పని చేయడమే మేలు అంటాడు. తన ఉద్యోగులను కూడా ఇంటినుంచి పనికే ప్రోత్సహిస్తున్నాడు. Hello from @Atlassian India! This a key R&D hub for us and our fastest growing region. From hiring our first employee here five years ago to 1,700 people today and growing with 50% working remote. And already kicking goals as 8th Best Place to Work. I am so proud of this team. pic.twitter.com/spnEFigqOS — Scott Farquhar (@scottfarkas) August 11, 2023 డైలీ మెయిల్ ప్రకారం స్కాట్ తన కంపెనీలు చాలామంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతినిచ్చాడు. తద్వారా వారు పనిలో మరింత ఉత్పాదకతను కలిగి ఉంటారనీ, ఏకకాలంలో అటు ఉద్యోగం, ఇటు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది స్కాట్ విశ్వాసం. ఇళ్ల రేట్లు బాగా ఉండే ఖరీదైన నగరం సిడ్నీలో అట్లాసియన్ ప్రధాన కార్యాలయం ఉంది.ఇక్కడ అద్దెలు ఎక్కువే. దీనికి తోడు భయంకరమైన ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు రావాలంటే గంటల సమయం పడుతోంది. ఇదే తనను రిమోట్ వర్కింగ్‌పై మళ్లించిందని చెప్తాడు. అంతేకాదు స్వయంగా స్కాట్ ఫర్క్హర్ 3 నెలలకు ఒకసారి కార్యాలయానికి వెళ్తాడు. సిడ్నీలో హౌసింగ్ వెనుక భారీ మొత్తం చెల్లించే బదులు, ఉద్యోగులు మంచి జీవితాన్నిగడిపేలా నగరానికి కొంచెం దూరంగా బీచ్ సైడ్ అపార్ట్మెంట్లలో ఉండవచ్చని, అలాగే ఇంటినుంచి పనిచేస్తే ఆఫీస్‌కు వచ్చి పోయే సమయం కూడా ఆదా అవుతుంది అంటాడు. తన ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేశారనేది కాకుండా వారిచ్చే ఔట్పుట్ ఏంటి అనేదే తనకు ముఖ్యమని ఫర్క్హార్ చెప్పుకొచ్చారు. -
10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్.. నమ్మడం లేదా!
అసలు ఎవరైనా ఎన్నేళ్ల వయసులో రిటైర్ అవుతారు.. 58, 60, 65, 70.. మరి ఓ కంపెనీ సీఈవో 12 ఏళ్ల వయసులో రిటైర్ అయితేనో! అదీ తన బర్త్‌డే రోజునే ఆ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకుంటేనో!! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. హోంవర్కు చేయాల్సిన వయసులో ఆఫీసు వర్కు చేయడం ఏమిటి? అనేదేగా మీ డౌటు. విషయం తెలియా లంటే.. పదండి మరి ఆస్ట్రేలియాకు.. ఎందుకంటే.. పిక్సీ ఉండేది అక్కడే మరి.. పిక్సీ కర్టిస్.. చిన్నప్పటి నుంచే చురుకైన పిల్ల.. బుర్రలో బోలెడన్ని ప్లాన్లు. దీనికి ఆమె తల్లి రాక్సీ జెసెన్కో ప్రోత్సాహం తోడైంది. రాక్సీ సిడ్నీలోని ఓ పీఆర్ కంపెనీ డైరెక్టర్. పిక్సీ చిన్న వయసులోనే పలు కంపెనీల ఉత్పత్తులకు మోడల్‌గా పనిచేసింది. పిక్సిస్ బౌ పేరిట హెయిర్ బౌస్ను అమ్మింది కూడా. అయితే, కరోనా సమయంలో తన దశ తిరిగింది. 2021లో తల్లితో కలిసి పిక్సీస్ ఫిడ్జెట్స్ పేరిట ఆట బొమ్మల ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. అది సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియాలో పిక్సీ యంగెస్ట్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిపోయింది. ఆమె నెల సంపాదన రూ. కోటికి పైనే. తనకు సొంత బెంజ్ కారు కూడా ఉంది. ఇన్నాళ్లూ ఆఫీసు వర్కుతో బిజీబిజీగా గడిపిన పిక్సీ ఇప్పుడు స్కూల్ హోంవర్కు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. తల్లి కూడా అదే చెప్పడంతో తన 12వ బర్త్‌డే రోజున రిటైర్ కానుంది. దీనికితోడు పిక్సీ కుటుంబం ఆమె తండ్రి కర్టిస్ పనిచేస్తున్న సింగపూర్‌కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో గత శనివారం ప్రీ బర్త్‌డే కం రిటైర్మెంట్ పార్టీని కూడా ఇచ్చారు. సింగపూర్ థీమ్‌తో సాగిన ఈ పార్టీకి వచ్చినవాళ్లందరికీ రూ.4,112 విలువ చేసే స్కిన్‌కేర్ ఉత్పత్తులతో కూడిన బహుమతిని కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఆస్ట్రేలియా లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఎంకోబ్యూటీ స్పాన్సర్ చేసింది. అదండీ.. 12 ఏళ్లకే తన బర్త్‌డే రోజున రిటైర్ అవుతున్న ఓ సీఈవో సంగతి.. ఇంతకీ పిక్సీ బర్త్‌డే కం రిటైర్మెంట్ డేట్ చెప్పలేదు కదూ.. ఆగస్టు 16. -
Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీ దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఉన్మాదిగా మారిన ఓ మాజీ ఉద్యోగి సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ, ఎండీలను కత్తితో పొడిచి చంపాడు. అమృతహళ్లి పంపా లేఔట్లో ఈ ఘోరం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్ ఏరోనిక్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ, సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆఫీసులోకి చొరబడిన జోకర్ ఫెలిక్స్ అనే మాజీ ఉద్యోగి కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ కంపెనీలో పనిచేసే నిందితుడు ఫెలిక్స్ ఇక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. తన వ్యాపారానికి ఫణీంద్ర, వినుకుమార్‌లు అడ్డు తగులుతున్నారని అనుమానించి ఆఫీస్కొచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బెంగుళూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. చదవండి: తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని.. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు. -
లిఫ్ట్లోఉద్యోగిని పట్ల సీఈఓ అసభ్య ప్రవర్తన
బెంగళూరు : ఓ కంపెనీ ఉన్నతాధికారి తన కింది మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జేపీ నగరలో నివాసం ఉంటున్న జనార్ధన్గుప్తా (40) కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు బుధవారం డీసీపీ కే.వీ. శరత్చంద్ర చెప్పారు. వివరాలు... కోరమంగలలోని జక్కసంద్రలో క్లాప్ ఎజ్యుటీన్మెంట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో జనార్దన్ గుప్తా సీఈఓగా పని చేస్తున్నారు. మేఘాలయకు చెందిన ఓ యువతి ఈ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. గతనెల 30న సదరు యువతి, సీఈఓ జనార్దన్ గుప్త హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న పారికా హోటల్లో భోజనం చెయ్యడానికి వెళ్లారు. భోజనం అనంతరం లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా జనార్దన్ సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అనంతరం ఆ యువతి కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు జనార్దన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.