కేరళ ర్యాగింగ్‌ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు | Kerala ragging victim ID Fresh Foods Musthafa chilling details about his Nephew | Sakshi
Sakshi News home page

కేరళ ర్యాగింగ్‌ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు

Published Tue, Feb 4 2025 2:51 PM | Last Updated on Tue, Feb 4 2025 3:11 PM

Kerala ragging victim ID Fresh Foods Musthafa chilling details about his Nephew

 సంచలనం రేపుతున్న కేరళ ర్యాగింగ్‌ అమానుషం

నిగ్గా  అంటూ అవమానించారు. టాయిలెట్‌ సీటు నాకించారు: ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ 

కేరళ (Kerala)లోని కొచ్చిలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ యువకుడు ఎత్తైన భవనం 26వ అంతస్తులోని  ఫైర్‌  ఎగ్జిట్‌ వింటోనుంచి దూకి  ప్రాణాలు తీసుకున్నాడు.  ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విపరీతమైన ర్యాగింగ్‌ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.  బలవంతంగా టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారని, నిగ్గా (నల్లగా ఉన్నాడని) అంటూ దారుణంగా వేధించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని బాధితుడి తల్లి ఆరోపించారు. విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసింది. వేధింపులపై దర్యాప్తు చేయాలని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సహాయం కోరింది.  

గుండెల్ని పిండేసే  విషయాలు
మరోవైపు  మిహిర్‌  అకాలమరణంపై  ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ పీసీ ముస్తఫా iD Fresh Foods CEO, PC Musthafa) స్పందించారు. మిహిర్‌ తన మేనల్లుడు అని సోషల్‌మీడియాలో వెల్లడించారు. నల్లగా ఉన్నాడనే కారణంగానే అతణ్ణి వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి,  తన మేనల్లుడు మిహిర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి  సంబంధించి ఒక భావోద్వేగ  పోస్ట్‌ను ఎక్స్‌ (గతంలో ట్విటర్) ఇన్‌స్టాలో  పంచుకున్నారు.

అలాగే మిహిర్‌తో, తన కుమారుడి కలసి  చిన్ననాటి స్నాప్‌ను పోస్ట్ చేసి బాధను వ్యక్తం చేశారు. చిన్నపుడు బెంగళూరులో కలిసిపెరిగారని వాళ్లిద్దరూ ప్రాణ ‍స్నేహితులని తెలిపాడు. కేవలం పదిహేనేళ్లకే నూరేళ్లు నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిహిర్‌ పాఠశాలలో, బస్సులో విద్యార్థుల గ్యాంగ్‌ దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడింది. శారీరకంగా దాడికి గురిచేసింది. చనిపోయేముందు రోజుకూడా మిహిర్‌ను కొట్టారు. దుర్భాషలాడారు.  అవమానించారు. అతన్ని బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నప్పుడు అతని తలని టాయిలెట్‌లోకి నెట్టారు. దీని తర్వాత, వారు అతన్ని 'పూపీహెడ్' అని పిలిచి ఎగతాళి చేశారు’’ అంటూ వేధింపుల తాలూకు వివరాలను పీసీ ముస్తఫా  వెల్లడించారు. 

 మిహిర్ మరణించిన తర్వాత కూడా'నిగ్గా' అని సంబోధించారని, ఆ సేజ్‌స్‌చూసి చలించిపోయాయనని, చాట్ స్క్రీన్‌షాట్‌లను చదివిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయానని ముస్తఫా పంచుకున్నారు.  చిన్నపిల్లాడి పట్ల ఇంత దారుణా అంటూ వాపోయారు.  అందుకే ఈ దుర్మార్గుల  బెదిరింపులు, ర్యాగింగ్‌లు లేని  ప్రపంచానికి వెళ్లిపోయాడు. వాడి  మరణం వృధా కాకూడదు.  న్యాయం జరగాలి అని డిమాండ్‌ చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ,న్యాయం గెలుస్తుందదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే  ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని నెటిజన్లును  కోరారు.  తనకోసం కాదు, ఎదిగే ప్రతిబిడ్డకోసం,  సురక్షితమైన వాతావరణంలో  చదువుకునేందుకు తాను చేస్తున్న పోరాటంలో  తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 

ఇవీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్‌

‘నేనూ.. మావారు’ : క్లాసిక్‌ కాంజీవరం చీరలో పీవీ సింధు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement