బెంగళూరు : ఓ కంపెనీ ఉన్నతాధికారి తన కింది మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జేపీ నగరలో నివాసం ఉంటున్న జనార్ధన్‌గుప్తా (40) కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు బుధవారం డీసీపీ కే.వీ. శరత్‌చంద్ర చెప్పారు. వివరాలు... కోరమంగలలోని జక్కసంద్రలో క్లాప్ ఎజ్యుటీన్‌మెంట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో జనార్దన్ గుప్తా సీఈఓగా పని చేస్తున్నారు.
మేఘాలయకు చెందిన ఓ యువతి ఈ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. గతనెల 30న సదరు యువతి, సీఈఓ జనార్దన్ గుప్త హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఉన్న పారికా హోటల్లో భోజనం చెయ్యడానికి వెళ్లారు. భోజనం అనంతరం లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా జనార్దన్ సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అనంతరం ఆ యువతి కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు జనార్దన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
లిఫ్ట్‌లోఉద్యోగిని పట్ల సీఈఓ అసభ్య ప్రవర్తన
Published Thu, Aug 7 2014 9:13 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement
Advertisement